న్యాయమూర్తులకు హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. ముంబయి పేలుళ్ల కేసులో ఉరిశిక్ష విధించిన సుప్రీం జడ్జిలను చంపేస్తామంటూ.. యాకూబ్ మెమన్ సంబంధీకులు హెచ్చరించటం.. అనంతరం సుప్రీంకోర్టును పేల్చేస్తామని వార్నింగ్ లు ఇవ్వటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో భారీ వార్నింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. పంజాబ్.. హర్యానా హైకోర్టుల్లోని 21 మంది న్యాయమూర్తులను ఈ నెల 21న చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ ఇవ్వటం కలకలం రేపుతోంది. బాంబు పేలుళ్ల ద్వారా ఆగస్టు 21న.. ఇరవైఒక్క మంది జడ్జిలను చంపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రెస్ క్లబ్ కు వార్నింగ్ లెటర్ చేరింది.
తమ కమాండర్స్ ను చంపినందుకు ప్రతీకారంగా ఈ పని చేస్తున్నట్లు పేర్కొన్న వారు.. ఈ నెల 21న బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖ పంజాబీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజా లేఖ నేపథ్యంలో జడ్జిలకు సెక్యూరిటీని మరింత పెంచారు. హైకోర్టు వద్ద భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. తాజా వార్నింగ్ లెటర్ గురించి ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ న్యాయమూర్తులను చంపేస్తామంటూ బెదిరింపులు పెరిగిపోతున్నాయి. దీనిపై నిఘా వర్గాలు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు బాధ్యులైన వారి సంగతి చూడాల్సిందే