118 ఏళ్ళు జీవించిన బామ్మ.. ఎలా జీవించారంటే?

Update: 2023-01-21 02:30 GMT
ప్రపంచంలోనే అత్యధిక వృద్ధురాలిగా లూసిల్ రాండన్ అనే భామ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రస్తుతం భూమిపై అత్యధిక వయస్సు కలిగిన ఈ భామ 118 ఏళ్ళు జీవిస్తున్నారు. ఫ్రాన్స్ కు చెందిన ఈ భామ టౌటోల్ పట్టణంలోని నర్సింగ్ హోంలో తుదిశ్వాస విడిచారు. లూసిల్ రాండన్ మరణంతో ఆమెరికాకు చెందిన 115 ఏళ్ల మారియా బ్రన్యాస్ మరేరా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు.

లూసిల్ రాండన్ దక్షిణ ఫ్రాన్స్ లోని అలెస్ పట్టణంలో 1904 ఫిబ్రవరి 11న జన్మించారు. ఆమెకు ముగ్గురు సోదరులు కాగా కవల సోదరి కూడా ఉన్నారు. ఆమె పేరు లైడీ. అయితే ఆమె పుట్టిన ఏడాదికే మరణించింది. ఈ క్రమంలోనే లూసిల్ రాండన్ సిస్టర్ ఆండ్రేగానూ ప్రాచుర్యం పొందింది. కైస్త్రవం పట్ల మక్కువతో నన్ గా మారారు. అప్పటి ఆమె వయస్సు 26 ఏళ్లే కావడం గమనార్హం.

లూసిల్ తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అనాథలు.. వృద్ధులకు ఆమె సేవ చేయడం ప్రారంభించారు. నన్ గా మారిన ఆమె రాండన్ విచీలోని ఆస్పత్రిలో 31ఏళ్ల పాటు సేవలందించారు. 75 ఏళ్ళ వయస్సు వచ్చే వరకు కూడా ఆమె వివిధ హోదాల్లో పని చేశారు. 2010 నుంచి ఆమె కళ్లు కన్పించక ఇబ్బందులు పడ్డారు. నడవడానికి చేతకాక వీల్ చైర్ వాడేవారు. ఈ క్రమంలోనే ఇదే  నర్సింగ్ హోంలో నిద్రిస్తూ తాజాగా కన్నుమూశారు.

కోవిడ్ సమయంలోనూ లూసిల్ మహమ్మరి బారినపడ్డారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు మాత్రం కన్పించకపోవడంతో వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరోనాను మూడువారాల్లో జయించింది. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న అత్యధిక వయస్సు కలిగిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

మరోవైపు 2022 ఏప్రిల్ లో అత్యంత వయస్సు కలిగిన వృద్ధురాలిగా లూసిల్ గిన్నిస్ రికార్డులకెక్కారు. అయితే ఈ రికార్డును ఆమె దురదృష్టకరమైన గుర్తించి పేర్కొనడం గమనార్హం. ఈ పాటికే తాను స్వర్గంలో ఉంటే బాగుండేదని.. కానీ ఆ ప్రభువు ఇంకా తనకు అవకాశం కల్పించేలేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా రాండన్ 118వ పుట్టిన రోజున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ శుభాకాంక్షు తెలుపుతూ ఓ లేఖ రాశారు. అలాగే 2021లో పోప్ ఫ్రాన్సిస్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

లూసిస్ కంటే ముందు జపాన్ కు చెందిన కానె టనక (119) పేరిట ప్రపంచంలో అత్యంత వయస్సు కలిగిన రికార్డు ఉండేది. కాగా లూసిస్ ఇన్నేళ్లు జీవించడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే పని చేస్తున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పింది. తాను 108వ యేటా కూడా పని చేస్తునే ఉన్నట్లు చెప్పారు. తన ఆహార అలవాట్ల విషయానికొస్తే ప్రత్యేకంగా ఏమిలేవని సన్నిహితులు చెప్పారు.

లూసిస్ ఉదయం 7గంటల కన్నా లేచి అల్పాహారం తీసుకునేవారు. ఎలాంటి ఆహారమైన తీసుకునేవారట. ఈ వయస్సులోనూ చాకెట్లు.. మిఠాయిలు తీసుకోవడానికి ఆమె ఏమాత్రం సంకోచించేవారు కాదు. ప్రతిరోజు ఉదయం మాత్రం చాకెట్ తప్పనిసరిగా తినేవారట. ఆమె అభిరుచి చూసిన చాలామంది లూసిస్ కు చాకెట్లు ఇచ్చేవారు. అలాగే వైన్ సైతం ఇష్టంగా తీసుకునేవారట. తన జీవితకాలం మొత్తం లూసిస్ వైన్ తీసుకునేవారని ఆమె వ్యక్తిగత వైద్యుడొకరు తెలిపారు.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News