ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఎంత పాపులరో.. అంత స్థాయి కాకున్నా టార్గెట్ వర్గాల ఆదరణ పొందటంలో లింక్డ్ ఇన్‌ను కొట్టే వారే లేరు. ప్రొఫెషనల్స్ కు ఎంతో ఉపయోగపడే ఈ నెట్ వర్కింగ్ సైటు సీఈవో జెఫ్ వీనర్ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. తాజాగా అతడు వ్యవహరించిన తీరును నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. బాస్ అంటే అలా ఉండాలి మరి అంటూ చెబుతున్నారు.
ఇంతకీ ఆయనేం చేశారన్న విషయంలోకి వెళితే.. లింక్డ్ ఇన్‌కు చెందిన డబ్లిన్ శాఖలో అనలిటిక్స్ మేనేజర్ గా పని చేస్తోంది మరియా వాల్టన్. వ్యక్తిగత అవసరం కోసం ఆమె ఒక సెలవు తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సరిగ్గా సెలవు రోజునే సూపర్ బాస్ (లింక్డ్ ఇన్ సీఈవో) తమ కార్యాలయానికి వస్తున్న సమాచారం వెల్లడైంది.
ధర్మసంకంలో పడింది మరియా. ముందుగా ప్లాన్ చేసుకున్నే సెలవు తీసుకోవాలా? సూపర్ బాస్ కోసం తన సెలవును క్యాన్సిల్ చేసుకోవాలా? అన్న విషయాన్ని ఆమె తేల్చుకోలేక తెగ మదన పడిపోయారు. ఇంతకీ.. సూపర్ బాస్ వచ్చేది ఎందుకంటే.. ఉద్యోగుల్ని కలవటానికి. మరి.. ఇలాంటి వేళ ఆఫీసులో ఉండకుండా సెలవు పెడితే బాగుంటుందా? అన్న సందేహం ఆమెను పట్టి పీడించింది.
చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా సెలవు తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు. తమ సూపర్ బాస్ వస్తున్న రోజును మిస్ కావాలని డిసైడ్ అయ్యారు. ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవటం ఇష్టం లేని ఆమె తన బాధను ఒక లేఖ రూపంలో తన డెస్క్ దగ్గర వదిలివెళ్లారు. సీఈవో జెఫ్ ను ఉద్దేశించి.. ఒక లేఖ రాసి అక్కడే తన ఫోటోను ఉంచారు. మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోల్పోయినందుకు క్షమించండి అంటూ లేఖ రాసి వెళ్లిపోయారు.
సెలవు ముగిసిన తర్వాత ఆఫీసుకు వచ్చిన మరియా కోసం ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఎదురుచూస్తోంది. తాను రాసిన లేఖ.. దాంతో పాటు తన ఫోటోను తమ సీఈవో సెల్ఫీ కనిపించటంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తన సూపర్ బాస్ మంచితనాన్ని.. నాయకత్వ లక్షణాల గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లింక్డ్ ఇన్ సీఈవో తీరు ఇప్పుడు అందరిలో చర్చగా మారింది.