ఐదుగురి మీద వేటేసిన మోడీ

Update: 2016-07-05 10:23 GMT
మొహమాటాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తాను నమ్మిన దారిలో దూసుకెళ్లే తత్వం ప్రధాని మోడీ సొంతం. ఆయనెంత నిక్కచ్చిగా.. ఎంత కఠినంగా ఉంటారని చెప్పటానికి ఏపీ వ్యవహారంలో ఆయన అనుసరిస్తున్న తీరే నిదర్శనం. మొన్నటికి మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తన మిత్రపక్షమైన తెలుగుదేశం నుంచి ఒక రాజ్యసభ సీటు తీసుకోవటానికి ఏ మాత్రం సంకోచించని మోడీ.. క్యాబినెట్ విస్తరణలో తన మిత్రుడికి ఒక స్థానం ఇచ్చేందుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. మోడీ లాంటి మిత్రుడితో చేతులు కలిపితే మంత్రి పదవి ఆశించటం ఎక్కువేనని చెప్పక తప్పదు. మిత్రుడి విషయంలో ఇంత కటువుగా ఉంటే.. స్వపక్షంలోని వారి విషయంలో మరెంతగా గట్టిగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు.

పని తీరులో ఏ మాత్రం రాజీ పడని ఆయన తన టీంలో పని తీరు విషయంలో అసంతృప్తిగా ఉన్న ఐదుగురి విషయంలో వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో 19 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చిన మోడీ.. ఇప్పటికే జట్టులో సభ్యులైన వారిలో ఐదుగురిపై వేటు వేశారు. మోడీ ఆగ్రహానికి గురై.. మంత్రివర్గం నుంచి నిష్క్రమించనున్న నేతల్ని చూస్తే..

= నిహాల్ చంద్ (పంచాయితీరాజ)
= రామ్ శంకర్ కటారియా (మానవవనరులు)
= సన్వర్ లాల్ (జల వనరులు)
= మోహన్ కుందారియా (వ్యవసాయ)
= మనుసుఖ్ భాయ్ వాసవ్ (గిరిజన)
Tags:    

Similar News