లోన్ మారటోరియం మరో రెండేళ్లు పొడిగింపు...!

Update: 2020-09-01 09:10 GMT
లోన్ మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ ‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుట హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన, ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని వెల్లడించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం... చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.కాగా, ఆగస్ట్‌ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కరోనా విగ్రహం కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా.. సాధారణ , మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయని, వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టగా.. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో అందరికీ ఉపశమనం లభించినట్లయింది.
Tags:    

Similar News