కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధింపు.. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల చెల్లింపు విషయంలో రిజర్వు బ్యాంకు మారిటోరియం ఇవ్వటం తెలిసిందే. మారిటోరియంతో తాత్కాలిక ఉపశమనమే తప్పించి.. పెద్ద ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తున్నా.. ఇప్పటికున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని ‘వాయిదా’ వేసుకోవటానికే ఇష్ట పడుతున్నారు పలువురు.
లాక్ డౌన్ విధించిన సందర్భంలో మూడు నెలల పాటు ఈఎంఐలు తర్వాత చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. అందుకు ఆర్ బీఐ ఓకే చెప్పటం తెలిసిందే. అలా ప్రకటించిన మారిటోరియం ఈ నెల 27తో ముగియనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. మరోసారి మారిటోరియం ప్రకటన చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మారిటోరియం 2.0 ప్రకటన ఈ వారంలో ఉంటుందని చెబుతున్నారు. తాజా మారిటోరియం మరో మూడు నెలల పాటు.. అంటే జూన్.. జులై.. ఆగస్టు నెలలకు వర్తించేలా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిటోరియంను ప్రకటించకుంటే వేతన జీవులతో పాటు.. వ్యాపార.. పారిశ్రామిక వర్గాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని చెబుతున్నారు.