చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ మాయదారి కరోనా తగ్గినట్టే తగ్గి చాపకింద నీరులా రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. కొత్త రూపంతో ప్రస్తుతం ‘ఒమిక్రాన్’గా ప్రపంచదేశాలను వణికిస్తోంది. శీతాకాలం రావడంతో యూరప్ దేశాలు ఈ కరోనా ఉధృతి పెరిగి అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే యూరప్ లోని జర్మనీ దేశం లాక్ డౌన్ ప్రకటించాయి. ఆస్ట్రియా కూడా అదే బాటలో నడిచింది. మిగతా దేశాలు లాక్ డౌన్ విధించేందుకు రెడీ అయ్యాయి. దీంతో మరోసారి ప్రపంచం లాక్డౌన్ దిశగా సాగుతున్నట్టు అర్థమవుతోంది.
ఇప్పటికే కరోనా రెండో వేవ్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు. లక్షల మంది వ్యాధి బారిన ఒల్లు, ఇళ్లు గుల్ల చేసుకున్నారు. ఇప్పుడు ‘ఒమిక్రాన్’ పేరిట వైరస్ రూపాంతరం చెందిన పదిరెట్లు వేగంగా వ్యాపిస్తోంది. కొత్త రూపంతో ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోంది.
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచదేశాలు ఈ వైరస్ పై అప్రమత్తం అయ్యాయి. మొన్నటికి మొన్న ఆరు దేశాల్లో ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు 20కిపైగా దేశాల్లో వెలుగుచూసింది. ఈ క్రమంలోనే యూరప్ దేశాలు అప్రమత్తం అయ్యాయి.
యూరప్ లోని జర్మనీ దేశం లాక్ డౌన్ విధించింది. కఠిన ఆంక్షలు పెట్టింది. కోవిడ్ నేపథ్యంలో జర్మనీలో వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులను సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు,రెస్టారెంట్లు, థియేటర్లు , సినిమా హాళ్లతోపాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
అలాగే టీకా తీసుకోని వారు బయట తిరగడాన్ని నిషేధించారు. టీకా తీసుకున్న వారికి మాత్రం మినహాయింపునిచ్చారు. జర్మనీలో బుధవారం 24 గంటల్లో 67వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే దాదాపు 70వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఇక యూరప్ లోని ఆస్ట్రియాలో డిసెంబర్ 11 వరకూ లాక్డౌన్ పొడిగించారు.గ్రీస్, డెన్మార్క్, యూకే, పోర్చుగల్ లాంటి దేశాల్లో కరోనా విజృంభిస్తోంది.