త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో లాక్‌ డౌన్ పొడిగింపు?

Update: 2020-05-25 10:10 GMT
సింగిల్ డిజిట్‌కు ప‌రిమిత‌మైన కేసులు ఇప్పుడు మ‌ళ్లీ 50 నుంచి 70 వ‌ర‌కు చేరాయి. భ‌విష్య‌త్‌లో ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ప్ర‌స్తుతం నాలుగో ద‌శ లాక్‌డౌన్ తీవ్ర స‌డ‌లింపుల‌తో ఉన్నా లేన‌ట్టే కొన‌సాగుతోంది. ఇదే కేసులు పెర‌గ‌డానికి అంద‌రూ భావిస్తున్నారు. మ‌ళ్లీ జ‌న‌జీవ‌నం సాధార‌ణ స్థితికి చేరుకోవ‌డం.. జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం వంటివి జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణలో కేసులు పెర‌గ‌డానికి కార‌ణంగా తెలుస్తోంది. అయితే త్వ‌ర‌లోనే తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఏకంగా జూన్ రెండో వారం వ‌ర‌కు పూర్తి లాక్‌ డౌన్ విధించే అవ‌కాశం ఉంద‌ని వినికిడి.

లాక్‌డౌన్‌, క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మొన్న స‌మావేశంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది చూసే ఉన్నాం. కేంద్రం తీరుపై అస‌హ‌నంతో ఉన్నారు. లాక్‌డౌన్‌తో న‌ష్ట‌పోతే కేంద్రం రాష్ట్రాల‌కు పెద్దగా ఆర్థికంగా ఇచ్చిందేమీ లేద‌ని మండిప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న అనాలోచిత చ‌ర్య‌లు, నిర్ణ‌యాల‌తో ఇప్పుడు దేశంలో కేసులు పెర‌గ‌డానికి కార‌ణంగా పేర్కొంటున్నారు. ఈ మేర‌కు స‌న్నిహితుల వ‌ద్ద చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌జా ర‌వాణాకు ప‌చ్చ‌జెండా ఊప‌డం - రైళ్లు - విమాన సేవ‌లు కూడా అందుబాటులోకి తీసుకువ‌స్తున్నారు. దీంతో మ‌రింత కేసులు పెరుగుతాయ‌ని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారుల‌తో చెబుతున్నారు. వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపున‌కు ఓకే చెప్ప‌డంతో రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయ‌ని కూడా ముఖ్య‌మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మొద‌టి నుంచి స‌డ‌లింపుల‌ను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వ‌ల‌స కార్మికుల‌ను తాము పొట్ట‌న పెట్టుకుని చూసుకుంటామ‌ని చెప్పారు. అయినా కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో తెలంగాణ సొంతంగా కార్మికుల‌ను త‌ర‌లిస్తోంది.

రాష్ట్రం కూడా వ‌ల‌స కార్మికుల‌ను అనుమ‌తిస్తోంది. ఈ క్ర‌మంలో వారికి వైర‌స్ సోకి ఉంది. వారి వ‌ల‌న రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. వీటిన్ని‌టి నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ వైర‌స్ క‌ట్ట‌డి కోసం కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర‌మే సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే ప‌నిలో ప‌డింది. మ‌రికొన్నాళ్ల పాటు లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంది. ఇప్పుడు రంజాన్ ఉప‌వాస దీక్ష‌లు కూడా ముగియ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని స‌మాచారం. త్వరలో మంత్రివ‌ర్గ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఆ సమావేశంలో లాక్‌డౌన్‌పై చర్చించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో జూన్ 14వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ ను రాష్ట్రంలో కొనసాగించే అవకాశం ఉందని స‌మాచారం. ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ మే 31వ తేదీ వ‌ర‌కు ఉన్న విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News