బ్రేకింగ్ : తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్‌

Update: 2021-05-11 09:11 GMT
తెలంగాణ లో కరోనా మహమ్మారి ని అరికట్టడానికి  లాక్‌ డౌన్ విధించే అంశంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌ డౌన్ అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు  ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఈ లాక్ డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర  హైకోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు తక్కువగానే ఉన్నప్పటికీ , ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని కొన్నిరోజుల పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాగా, మొదట్లో  రంజాన్ (మే 14) తర్వాత లాక్ డౌన్ ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ,  అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.  మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక ,టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో లాక్‌ డౌన్ విధించే అంశంపై అత్యవసరంగా సమావేశమైన మంత్రివర్గం సమావేశం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో లాక్‌ డౌన్  పై నిర్ణయం తీసుకోవడంతో ,  ధాన్యం కొనుగోళ్లతో ఇతర అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది.
Tags:    

Similar News