ఆ విష‌యంలో అభినంద‌న్ వ‌ర్డ‌ల్ లోనే మొద‌టోడ‌ట‌!

Update: 2019-03-04 04:27 GMT
యావ‌త్ దేశం మొత్తం ఇప్పుడు అభినంద‌న్ పేరు మారుమోగుతోంది. అత‌డి వీర‌త్వాన్ని.. దేశ భ‌క్తిని పెద్ద ఎత్తున పొగుడుతున్నారు. అత‌డ్ని స్ఫూర్తిగా తీసుకుంటున్న వారెంద‌రో. పాక్ సేన‌ల‌కు చిక్కి.. దేశానికి తిరిగి వ‌చ్చిన అత‌గాడికి భార‌తావ‌ని నీరాజ‌నాలు ప‌లుకుతోంది.  పాక్ లో అత‌గాడు ప్ర‌ద‌ర్శించిన వీర‌త్వం ఒక ఎత్తు అయితే.. దానికి ముందు అత‌డు చేసిన చ‌ర్య ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసింది.

కాలం చెల్లిన మిగ్ యుద్ధ విమానంతో.. అత్యంత శ‌క్తివంత‌మైన ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చివేయ‌టం మామూలు విష‌యం కాదంటున్నారు. అభినంద‌న్ యుద్ధ విమానం కూలే స‌మ‌యానికి ముందు.. పాక్ కు చెందిన ఎఫ్-16 య‌ద్ద విమానాన్ని కూల్చేసిన విషయాన్ని తాజాగా గుర్తించారు. అత‌డి నుంచి అందిన చివ‌రి సందేశం.. ఆర్ 73 సెలెక్టెడ్ అని. దీని అర్థం.. ద‌గ్గ‌రి లక్ష్యాల‌ను ఛేదించేందుకు ఆర్ 71 క్షిప‌ణుల్ని వినియోగిస్తారు. అదేస‌మ‌యంలో స‌దూర లక్ష్యాల‌ను ఛేదించ‌టానికి ఆర్ వీవీ-ఏఈ అనే మ‌ధ్య‌త‌ర‌హా క్షిప‌ణుల‌ను వినియోగిస్తారు.

పాక్ కు చెందిన ఎఫ్ -16 ను లాక్ చేసినంత‌నే ఆ విష‌యాన్ని సందేశ రూపంలో అభినంద‌న్ పంపారు. ఎఫ్ -16 కూల్చేసినంత‌నే.. అత‌డి యుద్ధ విమానం కూడా కూలింది. ప్యారాచూట్ సాయంతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే.. చ‌రిత్ర‌లో ఎఫ్ -16ను  కూల్చిన  ఘ‌ట‌న‌లు ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకోలేదు. ఆ ఘ‌న‌త సాధించిన దేశంగా భార‌త్ ఇప్పుడు సాధించింది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని కూల్చ‌టం ద్వారా ప్ర‌పంచ దేశాల్లో అభినంద‌న్ హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే.. అభినంద‌న్ వెళ్లింది పాత‌కాల‌పు మిగ్ -21 బైస‌న్ లో. ఆయ‌న ఎదుర్కొంది ప్ర‌పంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానం. అలాంటిది ర‌ష్యాకు చెందిన పాత‌త‌రం యుద్ధ విమానంతో  అత్యాధునిక అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేయ‌టం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. సాంకేతికంగా చూస్తే ర‌ష్యాకు చెందిన మిగ్ -21 బైస‌న్ కు.. అమెరికాకు చెందిన ఎఫ్ -16కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఉండ‌టమే కాదు.. ఎఫ్ -16 అత్యంత శ‌క్తివంత‌మైన‌ది కావ‌టం గ‌మ‌నార్హం. అభినంద‌న్ వీర‌త్వం.. తెలివితేట‌లే ఎఫ్ -16 కూల్చివేత‌కు కార‌ణంగా చెబుతున్నారు.


Tags:    

Similar News