ఉప్పు నిప్పు కంటే ఇంకా ఎక్కువ ప్రత్యర్థులం అన్నట్లుగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిపోయారు అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదైనా ప్రజా ప్రయోజనంపై వీళ్లద్దరు ఒక అవగాహనకు వచ్చారంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే విధంగా ఉన్న విషయంపై మిలాఖత్ అవుతారా? కానీ అలాగే జరిగిందట.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని..అయినా చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టడం లేదని లోక్ సత్తా ప్రశ్నిస్తోంది. ప్రశ్నించి ఊరుకోవడమే కాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఆడియో టేపులలో ఉన్న గొంతు తనది కాదని ఇంతవరకు చంద్రబాబు నాయుడు చెప్పలేదని, అలాంటప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని ఆ పార్టీ కార్యకర్తలు నిలదీశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు.
మొత్తంగా లేని సందేహాన్ని కలిగించడమే కాదు....దానికి అనుగుణంగా పలు వ్యాఖ్యలు కూడా చేసి లోక్‌సత్తా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇంతకీ కేసు ఏ విధంగా ముందుకుపోతుందో చూడాలి మరి.