సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న దారుణ పరాజయంతో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు తర్వాత ఎవరన్న అంశంపై ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. తన రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలు కావటాన్ని బాబు పరివారం జీర్ణించుకోలేని పరిస్థితి. ఇలాంటివేళ.. టీడీపీకి కొత్త రక్తం అనివార్యమైంది. అలా అని కుటుంబంలోని వారు తప్పించి మరెవరిని పార్టీ బాధ్యతలు అప్పజెప్పలేని పరిస్థితి.
ఇలాంటివేళ.. అందరి ఛాయిస్ నారా బ్రాహ్మణిపైనే ఉంది. పదేళ్ల క్రితం నారా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావాల్సి ఉందన్న మాట చెబితే.. పిచ్చోడ్ని చూసినట్లు చూసేవారు. ఏం మాట్లాడుతున్నావ్? అన్నట్లు తెలుగు తమ్ముళ్ల మాటలు ఉండేవి. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఎప్పుడైతే లోకేశ్ రాజకీయాల్లో రాణించ లేకపోవటం.. బాబుకు చినబాబు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చిన వేళ.. బ్రాహ్మణి వైపు మొగ్గు చూపించేటోళ్లు పెరిగారు.
అయినప్పటికీ.. బహిరంగంగా ఆ ప్రపోజల్ ను బాబు వద్దకు తీసుకెళ్లే సాహసం ఎవరూ చేయలేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం.. తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు.. తనకెంతో సన్నిహితంగా ఉన్న నేతలు సైతం పార్టీ నుంచి జంప్ అయిపోవటం.. మరోవైపు ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవటం బాబును అసహనానికి గురి చేస్తోంది.
పెరుగుతున్న వయసు.. తానెంత కష్టపడాలని భావించినా.. అందుకు సహకరించని ప్రస్తుత పరిస్థితుల్లో తన బాధ్యతల భారాన్ని పంచుకునే సరైన వ్యక్తి కోసం చూసిన బాబుకు.. బ్రాహ్మణి తప్ప మరెవరూ కనిపించలేదని చెబుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్య ప్లాటినం గాజులు అమరావతి ఉద్యమానికి ఇచ్చిన వైనంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తటంతో.. ఆమె ఏమాత్రం సరైన ఆప్షన్ కాదని తేలింది. ఇలాంటివేళలోనే అన్ని సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణికి మించిన చాయిస్ లేదన్న విషయంపై బాబుకు క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు.
ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా విభాగం లో కీలక భూమిక పోషిస్తున్న బ్రాహ్మణి కి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు సాగుతున్నట్లుగా చెప్పాలి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ కార్యకలాపాల్లో బ్యాక్ గ్రౌండ్ లో మాత్రమే ఉండే బ్రాహ్మణి.. తాజాగా పార్టీకి బలమైన అనుబంధ విభాగంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశం లో ఆమె పాల్గొన్నారు. భర్తతో కలిసి దిశానిర్దేశం చేసిన ఆమె.. ఒక రూట్ మ్యాప్ ను రూపొందించటం.. ఏం చేయాలన్న విషయంపై క్లారిటీగా చెబుతున్న వైనం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఈ విభాగానికి సంబంధించిన విందులో పాల్గొన్న బ్రాహ్మణి.. వారందరితో కలిసి గ్రూప్ సెల్ఫీ దిగటమే కాదు.. రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయటం కీలకంగా మారింది. క్రమపద్దతిలో బ్రాహ్మణిని పార్టీ కార్యక్రమాల్లో ఎలివేట్ చేస్తున్న వైనం చూస్తుంటే.. రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి బ్రాహ్మణి ఎంట్రీ ఖయమంటున్నారు. పార్టీలోకి ఎంట్రీ ఇవ్వటానికి ముందు.. బాబు వ్యూహాలతో పాటు.. బ్రాహ్మణి ఐడియాలజీతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగుతారని.. అప్పటికి వచ్చే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. బ్రాహ్మణి ని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచనకు రావటంతోనే బాబు కొత్త ఎత్తుగడకు తెర తీశారన్న మాట వినిపిస్తోంది.