ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ప్రముఖలంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పార్టీ శ్రీణులు తమ గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే జగన్ బర్త్ డే సందర్భంగా ఆయన నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. ఆయన ఇంట్లోనూ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఇంతకీ ఎవరివి అంటారా..?
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఈరోజు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కోడలు, లోకేశ్ సతీమణి బ్రాహ్మిణి కూడా ఈరోజే పుట్టిందట. దీంతో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో ఓ వైపు జగన్ బర్త్ డే సెలబ్రెషన్స్ ను వైసీపీ నాయకులు నిర్వహిస్తుుండగా.. మరోవైపు బ్రహ్మిణి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. దీంతో ఒకేరోజు అధికార, ప్రతిపక్ష నాయకులు సంబరాల్లో మునిగిపోవడం బహుశా ఈరోజే కావచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.
ఇక నారావారి కోడలైన బ్రాహ్మిణి నందమూరి ఫ్యామిలీ ఆడబిడ్డ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు వైపు నుంచి కూడా ఆమె శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందుబాటులో ఉన్నవారు ఇంటికి వస్తున్నారు.
దీంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు అందుబాటులో లేనివాళ్లు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ తన సతీమణికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ బావోద్వేగ ట్వీట్ చేశారు.
‘ నేను చీకటి వెలుగుల్లో, కష్ట సుఖాల్లో ధైర్యంగా నిలబడడానికి ఒకే కారణం.. బ్రహ్మిణి నా భార్య కావడం. స్పూర్తివంతమైన మహిళ అయిన బ్రహ్మిణి నాకు భార్యగా రావడం నా అదృష్టం.
హ్యాపీ బర్త్ డే’ అంటూ నారా లోకేశ్ ట్వీట్టర్ ద్వారా మెసేజ్ పెట్టారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. విదేశాల్లో ఉన్న కొందరు టీడీపీ అభిమానులుసైతం బ్రహ్మిణికి శుభాకాకాంక్షలు తెలుపుతున్నారు.