లోకేష్ విత్ తారక రత్న...బిగిసిన నారా నందమూరి బంధం

Update: 2023-01-10 11:09 GMT
తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎన్టీయార్ నుంచి అలా నందమూరి వారి బిడ్డ అయిన ఆ పార్టీని సాకుతోంది మాత్రం నారా ఫ్యామిలీ. ఇపుడు నారా చంద్రబాబు నుంచి నారా లోకేష్ దాకా ఆ పార్టీ విస్తరిస్తోంది. అంటే సీనియర్ ఎన్టీయార్  నుంచి ఆయన కుమారులకు రావాల్సిన రాజకీయ వారసత్వం కాస్తా నారా వంశం వైపుగా మళ్ళింది. ఇపుడు లోకేష్ అది ఆటోమేటిక్ గా టర్న్ అవుతోంది.

దానికి నందమూరి ఫ్యామిలీ కూడా వగచి వాపోయినా చేసేది ఏమీ లేదు. ఇరవి ఎనిమిదేళ్ళుగా చంద్రబాబు నీడన తెలుగుదేశం ఉంది అన్నది కఠిన వాస్తవం. అందుకే ఎన్టీయార్  బ్లడ్ బాలక్రిష్ణ సైతం బావ చంద్రబాబుతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. వీలుంటే తన మేనల్లుడు రాజకీయ వారసత్వం గట్టిపరచడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.

ఒక విధంగా నందమూరి వంశంలో ఇపుడు అంతా చంద్రబాబు నాయకత్వాన్ని ఒప్పుకున్నట్లే. అయితే లోకేష్ విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయనుకుంటే అది ఒక్క జూనియర్ ఎన్టీయార్ వైపు నుంచే అని అంటున్నారు. దానికి ఒక రీజన్ ఉంది. బాబుని గట్టిగా ఒకనాడు వ్యతిరేకించిన వారు నందమూరి హరిక్రిష్ణ. దాంతో ఆయన కుమారుడిగా జూనియర్ కి కూడా పట్టింపు ఉంది. పైగా తాను 2009లో ఎన్నికల ప్రచారం చేసినా పక్కన పెట్టారు అన్న ఆవేదన ఉంది అంటారు.

ఇక హరిక్రిష్ణ మరో కుమారుడు కళ్యాణ్ రామ్ సైతం ఇప్పటికైతే చంద్రబాబు సైడ్ తీసుకున్నట్లుగా లేదు. అదే టైం లో సినీ కెమెరా మాన్ నందమూరి మోహన క్రిష్ణ కుమారుడు అయిన తారకరత్న మాత్రం మామయ్య చంద్రబాబు అంటూ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఉంటున్నారు. ఆయన ఈ మధ్యనే అమరావతి రాజధాని రైతులతో పాటు పాదయాత్ర చేసి సంఘీభావం తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తారకరత్నకు ఉంది. ఆ విషయాన్ని మీడియాకు కూడా చెప్పారు. ఈ మధ్యనే చంద్రబాబుని కలసి తన మనసులో మాటను కూడా బయటపెట్టారని బాబు సైతం ముందు సరైన సీటు చూసుకుని పనిచేయమని కోరారని అంటున్నారు. ఇపుడు తారకరత్న లోకేష్ ని కలవడం ఆసక్తిని రేపుతోంది. బాబు తరువాత తెలుగుదేశంలో చినబాబే పవర్ ఫుల్. పైగా టికెట్ విషయంలో లోకేష్ కి కూడా ఒక మాట చెప్పి ఉంచాలనే తారక్ ఆయన్ని కలిశారు అని అంటున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి మొదలుకాబోతోంది. ఆయనకు మద్దతుగా కూడా తారకరత్న కలసి ఉంటారని అంటున్నారు. లోకేష్ సారధ్యం పట్ల మూడవతరం అయిన నందమూరి వంశం సుముఖంగా ఉందని తారకరత్న భేటీతో పూర్తిగా స్పష్టం అయింది. ఇక జూనియర్ ఎన్టీయార్  కళ్యాణ్ రామ్ ఏమి చేయబోతారు అన్నది చూడాలి.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి  ఎన్టీయార్   మొత్తం ఫ్యామిలీ కూడా ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబుని సీఎం చేయడానికి అంతా ఒకే త్రాటి మీదకు వస్తారని అంటున్నారు. నందమూరి నారా ఫ్యామిలీకి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని అంతా ఒక్కటే అని చాటి చెప్పడమే తారకరత్న ఉద్దేశ్యం అని అంటున్నారు.

ఏది ఏమైనా తారకరత్న  చంద్రబాబు చినబాబులతో భేటీలు వేయడం, తెలుగుదేశం రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని  చూసిన వారు అంతా అనుకుంటున్నది ఏంటి అంటే ఆయన ఎన్నికల్లో పోటీకి తయారుగా ఉన్నారని, కానీ చంద్రబాబు  ఎన్టీయార్   ఫ్యామిలీ నుంచి ఎంతమందికి టికెట్ ఇస్తారు అన్నదే చర్చగా ఉంది. పైగా ఇప్పటికిపుడు ఎవరి సీట్లో వెళ్ళి పోటీకి దిగినా అక్కడి తమ్ముళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రచారంలో మాత్రం తారకరత్నను వాడుకుంటారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News