ఈ ఫొటో చూసి.. నిజం తెలుసుకొని.. స్టడీగా నిల‌బ‌డ‌గ‌ల‌రా?

Update: 2021-04-23 00:30 GMT
ముట్టుకుంటే మాసిపోయే అందం అని చెప్పుకోవ‌డ‌మే గానీ.. పెద్ద‌గా చూసి ఉండ‌రు క‌దా..? అయితే.. పై ఫొటోలోని అందాన్ని ఓ సారి చూడండి. మిల్కీ బ్యూటీని త‌ల‌ద‌న్నే పాల‌పుంత‌లా ఉంది క‌దూ..! ఈ బ్యూటీ జ‌పాన్ కు చెందిన అమ్మాయి. ఈమె పేరు మ‌న‌కు ప‌ల‌క‌డం రాదుగానీ.. చ‌దువుకోండి. zaitaku_iyada ఇదీ ఆమె పేరు.

సెల‌బ్రిటీ ఏం కాదు.. సాధార‌ణమే. కానీ.. ఈ అంద‌మే స్టేట‌స్ పెంచింది. ఈ బ్యూటీని చూసి మ‌తిపోయిన ఎంతో మంది ఈమె ఫ్యాన్లు, ఏసీలుగా మారిపోయారు. ఈ అమ్మ‌డి ఫాలోవ‌ర్ల సంఖ్య‌.. ఇన్ స్టా గ్రామ్ లో 13 వేల మందికి, ట్విట‌ర్ లో 7 వేల మందికి పెరిగింది.

వీరంతా.. ఎప్పుడు అప్డేట్స్ పోస్టు చేస్తుందా? ఎప్పుడు త‌న స‌రికొత్త అందాల‌ను చూపెడుతుందా? అని ఎదు‌రు చూస్తుంటారు. వారిని ఎంట‌ర్ టైన్ చేసేందుకు స‌రికొత్త అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తోంది ఈ అమ్మ‌డు.  అయితే.. ఉన్న‌ట్టుండి ఈ మ‌ధ్య అభిమానుల గుండెలు బ‌ద్ద‌లు కొట్టే పోస్టు చేసింది.

పెళ్లి కుదిరింద‌నో.. ఆల్రెడీ పెళ్లయింద‌నో కాదు.. తాను అస‌లు అమ్మాయినే కాద‌న్న దారుణ‌మైన‌
 నిజాన్ని ప్ర‌క‌టించేశాడు ఆ వ్య‌క్తి. తాను మ‌గాడిన‌ని చెప్పి పోర‌గాళ్ల‌ గుండెలు బ‌ద్ధ‌లు చేశాడు. అంతేకాదు.. త‌న వ‌య‌సు 57 సంవ‌త్స‌రాల‌న్న క‌ఠిన వాస్త‌వాన్ని కూడా రివీల్ చేశాడు. గ్యాప్ లేకుండా పేల్చిన ఈ బాంబుల‌తో వేలాది హృద‌యాలు తునాతున‌క‌లైపోయాయి!

అందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను, ఆధారాల‌ను కూడా సోష‌ల్ మీడియా కోర్టుకు స‌మ‌ర్పించాడు. పై ఫొటోలో అమ్మాయి వెన‌క ఓ వ్య‌క్తి ఉన్నాడు చూశారా..? అత‌గాడే ఈ అంద‌గ‌త్తె! ఏంటీ మాయ‌..? అనుకుంటున్నారా? ఇదంతా ఫేస్ యాప్ మ‌హ‌త్మ్యం. ఫేస్ యాప్ ద్వారా ఇలా అమ్మాయి ముఖాన్ని త‌గిలించుకున్నాడ‌ట‌. ఇదంతా మోసం చేయ‌డానికి కాదని, తాను ఫేస్ యాప్ కు అడిక్ట్ అయ్యాన‌ని చెప్పుకొచ్చాడు స‌ద‌రు వ్య‌క్తి. అద‌న్న‌మాట సంగ‌తి.  

ఇదంతా విన్న ఫాలోవర్లలో కొందరు.. 'అంతా బ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా?' అని పాడుకుంటుంటే.. మరికొందరు మాత్రం.. ''ఎంత మోసం.. ఎంత మోసం.. ఈ క‌ప‌ట నాట‌కం.. ఈ ప‌గ‌టి వేష‌మూ..'' అనే బ్యాగ్రౌండ్ సాంగ్ వేసుకుంటున్నారు. మీరు కూడా జాగ్ర‌త్త‌మ్మా. అస‌లే రోజులు బాగోలేవు. ముందూ ఎన‌కా చూసుకోకుండా మన‌సులు పారేసుకుంటే.. ముక్క‌లైపోగ‌ల‌వు!
Tags:    

Similar News