వైరల్.. దిశను తరలించే లారీ వీడియో బయటకొచ్చింది

Update: 2019-12-10 05:24 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశను అత్యాచారం చేసిన అనంతరం ఆమెను ఘటనా స్థలం నుంచి తరలించేందుకు లారీని ఉపయోగించటం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. నవంబరు 27 రాత్రి దిశ బైక్ ను పంక్చర్ చేసి.. ఆమెను ట్రాప్ చేసిన నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేయటమే కాదు.. పెట్రోల్ పోసి తగలెట్టిన వైనం తెలిసిందే.

ఘటనా స్థలం నుంచి ఆమెను లారీలో తరలించే వేళలో.. అక్కడి సమీపంలోని సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ బయటకు వచ్చింది. 27 రాత్రి 10.28 గంటల సమయంలో తొండుపల్లి టోల్ గేట్ వద్ద నుంచి వెళుతున్న లారీలో దిశ డెడ్ బాడీని నిందితులు తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు.

టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ టీవీ కెమేరాల్లో లారీకి సంబంధించిన దృశ్యాలు నమోదు కావటమే కాదు.. తాజాగా ఆ ఫుటేజ్ వీడియోలు బయటకొచ్చి వైరల్ గా మారాయి. ఈ కేసు సంచలనంగా మారటం.. నిందితుల్ని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణ కోసం ఆమెను కస్టడీకి తీసుకొని.. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా ఘటనా స్థలానికి నిందితుల్ని పోలీసులు తీసుకెళ్లారు.

ఆ సందర్భంలో పోలీసులపై దాడికి యత్నించి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు ఎన్ కౌంటర్ అయ్యారు. దీనిపై దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. రాజకీయ నేతల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వీటితో పాటు కొద్దిమంది ఎన్ కౌంటర్ మీద సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ సాగుతోన్న సంగతి తెలిసిందే.


Full View
Tags:    

Similar News