ల‌వ్ ఎఫెక్ట్‌: కులం ఒక‌వైపు.. కూతురు మ‌రోవైపు.. ఆ తండ్రి నిర్ణ‌యం ఇదీ!

Update: 2022-11-10 02:30 GMT
ప్రేమ‌.. అంటేనే కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు, ఇప్పుడు భాషల‌కు సైతం అతీతంగా ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల మ‌ధ్య మొద‌ల‌య్యే ఒక అనుబంధం. కొన్ని కొన్ని సంద‌ర్బాల్లో ఇది సానుకూలంగా ముందుకు సాగి.. శుభం కార్డు ప‌డితే.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో విషాదంగా ముగిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఘ‌ట‌న కూడా ఇలాంటిదే. కులం ఒక‌వైపు.. క‌న్న కూతురు మ‌రోవైపు.. ప్రేమ వ్య‌వ‌హారంలో ఆ తండ్రి న‌లిగిపోయాడు. చివ‌ర‌కు స‌భ్య స‌మాజంలో బ‌త‌కాలంటే.. త‌న‌కు కుల‌మే ముఖ్య‌మని అనుకున్నాడు. దీంతో క‌న్న పేగును చేతులారా చిదిమేశాడు.

కర్ణాటకలో ఓ తండ్రి సొంత కూతురినే హత్య చేశాడు. వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందనే కారణంతో 14 ఏళ్ల బాలికను తుంగభద్ర కాలువలో తోసేసి చంపాడు. వేరే కులం వ్యక్తిని ప్రేమిస్తోందనే కారణంతో తన 14 ఏళ్ల కూతురిని చంపాడు ఓ తండ్రి. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఓంకార్ కూతురు.. కొడితిని పట్టణానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉంది. ఈ విషయం ఓంకార్ గౌడకు తెలిసింది. కూతురిని అతడు చాలా సార్లు మందలించాడు. అయినా ఆమె మాట వినకపోగా.. అక్టోబర్ 31న తుంగభద్ర కాలువలో తోసేసి చంపాడు. ఓంకార్ గౌడ నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే.. కూతురు ముఖ్య‌మా.. కులం ముఖ్య‌మా? అని మీడియా ఆయ‌నను ప్ర‌శ్నించ‌గా.. ``స‌భ్య‌స‌మాజంలో కుల‌మే ముఖ్యం. ప్ర‌తిరోజూ.. స‌మాజంలో సూటిపోటి మాట‌లు భ‌రించ‌లేను. అందుకే నా క‌డుపుకు నేనే చిచ్చు పెట్టుకున్నాను. ఇది త‌ప్పుకాదు!`` అని త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకోవ‌డం గ‌మ‌నార్హం.

సొంత త‌మ్ముడే..

యూపీలోనూ..పెళ్లి త‌ర్వాత కూడా ప్రియుడితో సెక్స్‌లో పాల్గొంటున్న ఓ మ‌హిళ‌ను, ఆమె ప్రియుడిని సొంత త‌మ్ముడే న‌రికి చంపించాడు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పత్ షామ్లీ జిల్లాలో పరువు హత్య జరిగింది. జిల్లా సరిహద్దులోని లంబ్ గ్రామం అడవిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని ఆసరా గ్రామానికి చెందిన మహిళ, అదే గ్రామానికి చెందిన అరిఫ్గా పోలీసులు గర్తించారు.

స్థానికుల కథనం ప్రకారం.. 8, 9 సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆ మహిళకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సైతం అరిఫ్ ఆ మహిళ మధ్య సంబంధం కొనసాగించింది. కొద్దిరోజుల క్రితమే ఇద్దరూ పరారయ్యారు అనంతరం ఇలా శవాలుగా అడవిలో కనిపించారు. మహిళ సోదరుడే ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు