టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అభిమానం పెల్లుబుకుతోంది. తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ కేసీఆర్ చెరగని ముద్రవేశారని అర్థమవుతోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఆంధ్రా యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తాజాగా కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరానికి చెందిన మహేష్ దారుణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మహేష్ తన నాలుకను తానే కోసుకున్నాడు. కేసీఆర్ అంటే పడిచచ్చే మహేష్ బుధవారం రాత్రి శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి కేసీఆర్ గెలవాలని పూజలు చేయడానికి వెళ్లాడు. అక్కడే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటూ నినాదాలు చేస్తూ తనతోపాటు తెచ్చుకున్న కత్తిని తీసుకొని నాలుకను కోసి హుండీలో వేశారు.
యువకుడు ఇలా హఠాత్తుగా చేసిన పనితో హతాషులైన పూజారులు, స్థానికులు వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతడికి సర్జరీ చేసి నాలుకను అతికించి కుట్లు వేసినట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ ఏపీలోని అన్నవరంలో కొంత మంది అభిమానులు పూజలు చేశారు. ఏపీకి కేసీఆర్ వెళ్లిన సమయంలోనూ అభిమానులు కటౌట్లతో అభిమానం చాటుకున్నారు. ఇప్పుడు ఇలా యువకుడు అఘాయిత్యానికి పాల్పడడం అందరినీ కలిచివేసింది.