ప్రేమ పేరుతో పైశాచికం అంతకంతకూ పెరుగుతోంది. ఇష్టపడితే చాలు.. తమ సొంతం కావాల్సిందేనన్న దారుణ ఆలోచన అంతకంతకూ పెరుగుతోంది. తాము ప్రపోజ్ చేస్తే ఓకే అనాలి.. తాము పెళ్లి చేసుకుంటామంటే అడ్డు చెప్పకూడదన్న తాలిబన్ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. ప్రాణం కంటే ప్రేమించామని చెప్పే అమ్మాయి... జీవితాన్ని అంతం చేయటంలో ప్రేమ కంటే పైశాచికం ఎక్కువగా కనిపించే పరిస్థితి. ప్రేమ.. పెళ్లి పేరుతో ఉన్మాదానికి పాల్పడి ప్రాణాలు తీసిన వైనాలు తెలిసిందే. తాజాగా అలాంటి దారుణమే మరొకటి చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దమ్మపేట శివారులోని నెమలిపేటలో దారుణ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నో అన్నదన్న కోపంతో గొంతులో పొడిచి ప్రాణాలు తీయటమే కాదు.. పురుగుల మందు తాగి సదరు ఉన్మాది ప్రాణాలు తీసుకున్న వైనం సంచలనంగా మారింది.
కుక్కునూరుకు చెందిన ఊటుకూరు శ్రీనివాసరావు అశ్వారావుపేటలో ఉంటారు. ఖమ్మం జిల్లా వేంనూరు మండల పరిషత్ కార్యాలయంలో యూడీసీగా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె 22 ఏళ్ల ప్రవళిక నెమలిపేట ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యా వలంటీర్ గా పని చేస్తున్నారు.
కుక్కునూరుకు చెందిన వనమా వెంకటేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావు హైదరాబాద్ లో ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధురికం ఉంది. ప్రవళికను తమ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని కోరారు. అందుకు నో చెప్పారు. ఇటీవల ఆమెకు మరో కుర్రాడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీంతో.. తనతో పెళ్లికి నో చెప్పిన ఆమెను అంతమొందించాలన్న దుర్మార్గపు ఆలోచనతో పని చేస్తున్న స్కూల్ కు వచ్చాడు.
ముందుగా మాట్లాడుతున్నట్లుగా నటించి.. తర్వాత పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. దీంతో శ్రీనివాసరావు తీరుకు భయపడిన ప్రవళిక స్కూల్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని సోదరుడి కోసం ఫోన్ చేసింది. దీంతో.. ప్రవళిక సోదరుడు హుటాహుటిన నెమలిపేట స్కూల్ వద్దకు చేరుకున్నాడు. కిటికీలో సోదరుడ్ని చూసిన వెంటనే తలుపు తెరిచి అతడి దగ్గరకు పరిగెత్తుకెళ్లే ప్రయత్నం చేసింది.
అక్కడే ఉన్న శ్రీనివాసరావు ఆమె జుట్టు పట్టుకొని వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో బలంగా దించేశాడు. ప్రవళిక సోదరుడు బైక్ దిగి సోదరి దగ్గరకు వచ్చే లోపే ఈ దారుణం జరిగిపోయింది. వెంటనే.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గొంతులో కత్తి బలంగా దిగటంతో తీవ్ర రక్తస్రావానికి గురై విలవిలాడుతూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది ప్రవళిక. దాడికి ముందు శ్రీనివాసరావు ప్రవళికతో ఘర్షణ పడిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. అప్పటివరకూ ప్రాణాలతో ఉన్న ప్రవళిక ఉన్మాది చేతిలో విగతజీవిగా మారటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.