ఆ కేసులో అద్వానీ అండ్ కోకు ఊర‌ట‌

Update: 2017-06-07 07:59 GMT
వివాదాస్ప‌ద క‌ట్ట‌డం కూల్చివేత కేసులో ఇబ్బంది ప‌డుతున్న బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌కు తాజాగా ఊర‌ట ల‌భించింది. నిజానికి ఈ ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డినప్ప‌టికీ.. తాజాగా సుప్రీం సూచ‌న‌తో  క‌మ‌ల‌నాథుల్లో కురువృద్ధులైన ఎల్‌ కే ఆద్వానీ.. ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి ల‌తో పాటు కేంద్ర‌మంత్రి ఉమాభార‌తిలు ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
ఇప్ప‌టికే.. త‌మ మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్ని ర‌ద్దు చేయాల‌ని వారు కోరుతున్నారు. అయితే.. ఆరోప‌ణ‌ల పై కేసు న‌మోదు చేయ‌కూడ‌ద‌న్న సూచ‌న‌ను తిర‌స్క‌రించిన కోర్టు.. వారికి కొంత ఊర‌ట ఇచ్చే ఆదేశాల్ని జారీ చేసింది. కేసు విచార‌ణ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అద్వానీతో స‌హా బీజేపీ నేత‌ల‌పై కేసు న‌మోదు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ల‌క్నోలో జ‌రిగే ప్ర‌తి వాయిదాకు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌టంతో.. ఒక పెద్ద ఊర‌ట‌గా చెప్పొచ్చు.

జాతీయ స‌మైక్య‌త‌కు హాని క‌లిగించ‌టం.. ప్రార్థ‌నా స్థ‌లాన్ని అప‌విత్రం చేయ‌టం.. ఉద్దేశ‌పూర్వ‌కంగా మ‌త‌ప‌ర‌మైన భావాల్ని దెబ్బ తీయ‌టం.. బ‌హిరంగ అల్ల‌ర్ల‌కు దారి తీసేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం.. అల్ల‌ర్లు చేయ‌టం లాంటి అభియోగాలు ఉన్నాయి. వీటికి కోర్టు నేర‌పూరిత కుట్ర అభియోగాల్ని మోపింది.

బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌పై మోపిన ఆరోప‌ణ‌లు కానీ రుజువైన ప‌క్షంలో వారికి ఐదేళ్ల జైలుశిక్ష లేదా జ‌రిమానా లేదా రెండింటిని విధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌.. ఈ కేసును ల‌క్నో కోర్టులో రోజువారీగా విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News