దేశంలోనే అతి పెద్దదైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. తనదైన శైలిలో దూసుకెళ్లిపోతూ.. తిరుగులేని అధిక్యతతో ముందుకెళుతున్న డైనమిక్ సీఎంగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే అధికార వ్యవస్థల మీద పట్టు తెచ్చుకోవటమే కాదు.. తన పనితీరుతో అందరి మనసుల్ని దోచుకుంటున్న ఆయనే యూపీ సీఎం యోగి అదిత్యనాథ్. అలాంటి ఆయనకు తొలిసారి ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు.
తాజాగా లక్నో విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన యోగికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ ను అడ్డుకొని విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. యోగి హయాంలో దళితులు.. ముస్లింల పైనా హింస పెరుగుతుందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ఊహించని విధంగా ఆయన కాన్వాయ్ వచ్చే రహదారి మీద పడుకొని నిరసన తెలిపారు. వారిని క్లియర్ చేసేందుకు అధికారులు కిందామీదా పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యోగి కాన్వాయ్ కాసేపు అలా నిలిచిపోయింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ను నిలిపివేసి..కాసేపు అసలేం జరుగుతుందో అర్థం కాని రీతిలో పరిస్థితి ఏర్పడటానికి కారణమైన అధికారులపై ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. భద్రతా నిబంధనల్ని ఉల్లఘించేలా పరిస్థితులు ఏర్పడటానికి కారణమైన ఒక ఎస్ ఐ.. ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిరసనకు కారణమైన పద్నాలుగు మంది విద్యార్థుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా.. తనకు తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న ముఖ్యమంత్రి యోగికి తాజా ఆందోళన ఊహించని షాక్ గా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/