వెయ్యి విమానాలు ఆగిపోయాయి

Update: 2015-09-10 04:23 GMT
తమ హక్కుల సాధన కోసం సమ్మె చేయటం మామూలే. అది భారత్ లోనూ కాదు.. అభివృద్ధి చెందిన జర్మనీ లాంటి దేశంలోనూ తప్పని పరిస్థితి. తాజాగా ఒక విమానయాన సంస్థ చేపట్టిన సమ్మె ఇప్పుడు ముచ్చమటలు పోయించటమే కాదు.. సదరు కంపెనీకి సినిమా కనిపిస్తోంది.

పదవీ విరమణ వయసుతో పాటు.. పింఛన్ లు తదితర డిమాండ్ లతో సమ్మె చేస్తామని చెబుతూ.. లుఫ్తాన్సాకు చెందిన సిబ్బంది సమ్మె చేయాలని నోటీసు ఇచ్చారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో సదరు విమానయాన సంస్థ సానుకూలంగా స్పందించకపోవటంతో ఇష్యూ సమ్మె వరకూ వచ్చింది. తాజాగా లుఫ్తాన్సాకు చెందిన సిబ్బంది సమ్మె తీవ్రతరం చేయటంతో ఒక్క జర్మనీలోనే వెయ్యి విమాన సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితి.

ఈ సమ్మె కారణంగా దాదాపు 1.4లక్షల మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. సమ్మె కారణంగా విమానాలు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు కదలకపోవటంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులంతా సిబ్బంది స్టైక్ తో ఎయిర్ పోర్టు లోనే ఉండిపోయి కాలం వెళ్ల దీశారంట. మొత్తానికి తమ డిమాండ్ల సాధనేమో కానీ.. సమ్మెతో లుఫ్తాన్సా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రం పగలే చుక్కలు కనిపించే పరిస్థితి.
Tags:    

Similar News