భూవివాదంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వంశీ మోసం చేశాడు!

Update: 2021-10-24 23:30 GMT
గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై గెలిచి.. త‌ర్వాత‌.. వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయిన‌.,. గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.. ఇటీవల చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుమారుడు.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద ర్శి.. నారా లోకేష్‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా టీడీపీ నాయ‌కులు కూడా తీవ్ర‌స్థాయిలో వంశీపై విరుచుకుప‌డుతున్నారు. నిన్న‌టికి నిన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు.. వంశీని ప‌శువుల డాక్ట‌ర్ అనుకున్నాం.. కానీ..ప‌శువు కంటే హీన‌మైన వ్య‌క్తి అని నిప్పులు చెరిగారు.

ఇక‌, తాజాగా పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి మ‌ద్దిప‌ట్ల సూర్య‌ప్ర‌కాశ్ మ‌రో నాలుగు అడుగులు వేశారు. వ‌ల్ల‌భ నేని వంశీ వంటి మోస‌గాడు.. మ‌రొక‌రు ఉండ‌రని ఆయ‌న నిప్పులు చెరిగారు. భూ వివాదంలో ఏకంగా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌నే వంశీ మోసం చేశాడ‌ని.. సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. పైకి మాత్రం వంశీ.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌ట్ల ఎంతో ప్రేమ‌గా ఉంటాడ‌ని.. ఆయన కుటుంబం ప‌ట్ల కూడా ఎంతో విధేయ‌త‌తో ఉంటాడ‌ని.. కానీ.. ఒక భూ వివాదంలో వంశీ జూనియ‌ర్‌ను మోసం చేశాడ‌ని.. ఆరోపించారు. అంతేకాదు.. ప‌రిటాల ర‌విని కూడా వంశీ మోసం చేశాడ‌ని.. అన్నారు. వీటికి వంశీ స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు.

``ప‌రిటాల ర‌వి హ‌త్య త‌ర్వాత‌.. వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ స‌మ‌యంలో ఆయ‌న త‌న వెంట ప‌రిటాల‌కు చెందిన భూముల ప‌త్రాలు, ఆస్తుల ప‌త్రాల‌ను కూడా తీసుకువెళ్లాడు. ఇది.. ప‌రిటాల కుటుంబాన్ని మోసం చేయ‌డం కాదా!`` అని సూర్య‌ప్ర‌కాశ్ నిప్పులు చెరిగాడు. అదేస‌మ‌యంలో వంశీ చేసిన `మ‌గ‌త‌నం..` కామెంట్‌పై సూర్య‌ప్ర‌కాశ్ మాట్లాడుతూ.. వంశీకి చిన్న‌మెద‌డు చితికిపోయింద‌ని.. అందుకే.. చంద్ర‌బాబు లోకేష్‌ల మ‌గ‌త‌నం గురించి మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. తాను చేసిన ఆరోప‌ప‌ణ‌ల‌పై వంశీ స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

అంతేకాదు.. వంశీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆడిస్తున్న మేర‌కు వంశీ ఆడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. వంశీని కుక్క‌తో పోల్చిన మ‌ద్ద‌తిప‌ట్ల సూర్య‌ప్ర‌కాశ్‌.. ఒక పాఠ‌శాళ ఉపాధ్యాయుడి కుమారుడిగా.. ఉన్న వంశీ నేడు.. వంద‌ల వేల కోట్ల రూపాయ‌లు ఎలా పోగేసుకున్నాడ‌ని.. నిల‌దీశార‌ని.. ఇదంతా ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి ఇది సాధ్య‌మేనా అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ హ‌యాంలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో భూముల‌ను సేక‌రించిన స‌మ‌యంలో అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. వంశీపై నిప్పులు చెరిగారు. త‌ను సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని.. స‌వాల్ రువ్వారు.
Tags:    

Similar News