రాజకీయాల్లో విమర్శల తీవ్రత ఎక్కువే. ఆరోపణల చురుకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఆధారాలు చూపించకున్నా.. తమ ప్రత్యర్థుల గురించి ఆరోపణలు చేసేయటం కొత్త విషయం కాదు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చెలరేగిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పనిలో పనిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చెలరేగిపోయిన ఆయన.. కేటీఆర్‌పై సరికొత్తగా ఆరోపణలు చేయటం కలకలం రేపుతోంది.
శ్రీమంతుడు సినిమాకు నిర్మాత.. బాహుబలి డిస్ట్రిబ్యూటర్ మరెవరో కాదని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటూ మధుయాష్కీ ఆరోపించారు. అంతేకాదు.. కేటీఆర్‌కు అక్రమ విల్లాలు ఉన్నాయని.. ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలు చేస్తుంటారని ఆరోపించారు. వాటర్ గ్రిడ్ లో కేటీఆర్ అవినీతి బట్టబయలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధమా అంటూ కేటీఆర్‌కు సవాలు విసిరిన ఆయన.. కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని జోస్యం పలికారు.
ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. చంద్రుళ్లు ఇద్దరూ వెన్నెల పంచుకుంటూ తెలుగు ప్రజలకు అమావాస్య చూపిస్తున్నారని విమర్శించారు. ఇద్దరు చంద్రుళ్లు కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారన్న యాష్కీ.. రాజకీయ లబ్థి కోసం ప్రజలను రెచ్చగొడుతూ.. చంద్రుళ్లు ఇద్దరు మాత్రం లడ్డూలు పంచుకుంటున్నారన్నారు.
దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఎదిగిన ఇద్దరు చంద్రుళ్లు సొంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లో నటిస్తున్నారన్నారు. బెత్తెడుగాళ్లు కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నారని ఆరోపించిన ఆయన.. తెలంగాణ ముఖ్యమంత్రిని దరిద్రపు సీఎంగా అభివర్ణించారు.