నూతన సచివాలయం నిర్మించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా కదలడంపై కొత్త కామెంట్ తెరమీదకు వచ్చింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి - మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే సచివాలయం కూలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయం కూల్చివేత వెనుక వాస్తు కారణాలతో పాటు కేటీఆర్ కూడా ఒక కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వారు ప్రస్తుత సచివాలయం నుంచే బాధ్యతలు నిర్వహించినప్పటికీ వారి కొడుకులు ముఖ్యమంత్రులు కాలేకపోయారని మధుయాష్కీ తెలిపారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత.. 150 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాలేదని మధు యాష్కీ గుర్తు చేశారు. అయితే అదే ఇబ్బంది తన కుమారుడు కేటీఆర్ కు ఎదురవద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసమే వాస్తు పేరుతో ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని యాష్కీ మండిపడ్డారు.
ఇదిలాఉండగా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మరో ఆసక్తికరమైన విమర్శ చేశారు. ఒకరిద్దరికీ కాకుండా తెలంగాణ రాష్ట్రానికి డెంగ్యూ సోకిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా వందల మంది చనిపోతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు వదిలేసి తన ఇంటి నిర్మాణం - ప్రజల ఆరోగ్యాన్ని వదిలి తన సొంత ఆరోగ్యం - యువకుల భవిష్యత్ ను విస్మరించి కొడుకు రాజకీయ జీవితం గురించి ఆలోచిస్తున్న ముఖ్యంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని భట్టి మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/