అమ్మ అసెంబ్లీ ఉప ఎన్నిక‌..మాట నెగ్గించుకున్న సెల్వం

Update: 2017-11-30 12:16 GMT
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన‌న్ పేరు ఖరారైంది. పార్టీ వర్గాల కథనం ప్రకారం మధుసూదన్ అభ్యర్థిగా ఆర్కేనగర్ నుంచి పోటీ చేయనున్నారు.. అన్నాడీఎంకే పార్టీ నుంచి 27 మంది నాయకులు ఆర్ కే నగర్ టిక్కెట్ కోసం పోటీ పోటీపడ్డారు. అయితే టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నప్పటికీ సొంత నియోజకవర్గం కావడం, పన్నీర్ సెల్వం మద్దతు ఉండటం తదితర కారణాల వల్ల మధుసూదన్ అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలో దింపుతున్న‌ట్లు అన్నాడీఎంకే తెలిపింది.

అయితే ఈ అభ్య‌ర్థిత్వంలో సీఎం ప‌ళ‌నిస్వామిపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం త‌న పంతం నెగ్గించుకున్నార‌ని అంటున్నారు. దివంగ‌త జ‌య‌ల‌లిత ప్రాతినిధ్యం వ‌హించిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగేందుకు ఇటు సీఎం వర్గీయులు, అటు ప‌న్నీర్ వ‌ర్గీయులు  పోటీ పడ్డారు. దీంతో ఆర్ కే నగర్ టిక్కెట్ ఖ‌రారు ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపిన పళనిస్వామి - పన్నీర్ సెల్వం అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గంలో మధుసూదనన్ తో పోటీ చేయించాలని నిర్ణయించారు.

మ‌ధుసూద‌న‌న్ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ప‌ళ‌నిస్వామి వ‌ర్గం త‌మ‌కు చాన్స్ ద‌క్కాల‌ని ప‌ట్టుబ‌ట్టగా...ప‌న్నీర్ సెల్వం త‌న మాట నెగ్గించుకున్నార‌ని తెలుస్తోంది. మ‌ధుసూద‌న‌న్ పార్టీ సినియ‌ర్ నేత కాబ్ట‌టి ఆయ‌న‌ను అభ్య‌ర్థిగా నిర్ణ‌యించాల‌ని కోరారు. దీంతో పార్టీ నేత‌లు సైతం స‌మ్మ‌తించి ఆయ‌న్నే ఖ‌రారు చేశారు. దీంతో ఇటు ప‌ళ‌నిస్వామి అటు ప‌న్నీర్ సెల్వం అభ్య‌ర్థికి అభినంద‌న‌లు తెలిపారు. కాగా, పార్టీ అస‌మ్మ‌తి నేత‌లైన శ‌శిక‌ళ త‌ర‌ఫున ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News