హ‌నీ ట్రాప్‌: లిప్‌ స్టిక్‌ లో కెమేరాలతో సెక్స్ సీన్ల షూట్‌

Update: 2019-09-30 09:01 GMT
దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ హ‌నీ ట్రాప్ సెక్స్ కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణం వెనుక మొత్తం నలుగురు మహిళలు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. బిజెపికి చెందిన మాజీ మంత్రులతో పాటు గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి పలువురు ఐఏఎస్ అధికారులు సైతం ఈ వలలో చిక్కుకున్నట్టు వస్తోన్న వార్తలు జాతీయ రాజకీయాలలో సైతం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు హనీ ట్రాప్ లో సెక్స్ వర్కర్ల‌తో పాటు... ఉ కాలేజ్ యువతులను సైతం ట్రాప్ చేసి తమ తండ్రుల వయసున్న అధికారులతో - రాజకీయ నాయకులతో సెక్స్‌ లో పాల్గొనేలా ప్రేరేపించిన‌ సంగతి తెలిసిందే.

ఇండోర్‌కు చెందిన మోనికా య‌ద‌వ్ అనే 18 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న యువ‌తి చెప్పిన విష‌యాల‌తో పోలీసుల చేస్తోన్న విచార‌ణ‌లో క‌ళ్లు బైర్లు క‌మ్మే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు స్పై కెమేరాతో మాత్ర‌మే శృంగార సీన్లు షూట్ చేశార‌నుకుంటే ఇప్పుడు మ‌రో కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. లిప్‌ స్టిక్‌ ల్లో - కళ్లద్దాల్లో రహస్యంగా దాచిన కెమెరాల ద్వారా ఈ సీన్లు షూట్ చేసేవార‌ని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పదుల సంఖ్యలో స్పై కెమెరాలను స్వాధీ నం చేసుకున్నామన్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి ఒక‌రు ఓ యువ‌తితో ఓ హోట‌ల్ గదిలో శృంగారం చేస్తోన్న వీడియో ఒక‌టి ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. అలాగే ఆర్ ఎస్ ఎస్‌ కు చెందిన ఓ నాయ‌కుడి శృంగార వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అందమైన అమ్మాయిలు... మధ్యతరగతి యువత... కాలేజీల్లో చదువుకునేందుకు ఇబ్బందిపడుతున్న వారితో పాటు... ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పెళ్లయిన యువతులను సైతం ఈ ముఠా ట్రాప్ చేసి తమ వలలో వేసుకుంది. లగ్జరీ లైఫ్ ను రుచి చూపిస్తూ వీళ్లు  తాము చెప్పిన వారితో శృంగార కార్యకలాపాలు చేసేలా ప్రోత్సహించారు.
 
అదే సమయంలో వారు ఆ యువతులతో ఉన్న సమయంలో వీడియోలు తీసి - బ్లాక్‌ మెయిల్‌ చేయడం ద్వారానూ పనులు చేయించుకునేవారు. వీరి ఉచ్చులో చిక్కుకున్న ఓ యువ‌తి ఓ సీనియ‌ర్ ఇంజ‌నీర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి వాళ్లు చెప్పిన‌ట్టే చేసింది. ఆ త‌ర్వాత ఆమెను ప‌లు ర‌కాలుగా బ్లాక్‌ మెయిల్ చేసి వాడుకున్నారు. ఓ సీనియర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం  సిట్‌ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్ - మోనిక యాదవ్ - శ్వేత విజయ్‌ జైన్ - శ్వేత స్వప్నిల్‌ జైన్ - బర్ఖా సోని - ఓం ప్రకాశ్‌ కోరిలను సిట్‌ అరెస్ట్‌ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్ - ఐపీఎస్‌ అధికారులు - మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో - ఆడియో క్లిప్‌ లను వేలాదిగా సిట్‌ స్వాధీనం చేసుకుంది. 


Tags:    

Similar News