భార్య లావుగా ఉంద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పేశాడు!

Update: 2018-10-25 05:15 GMT
ట్రిపుల్ త‌లాక్ పై ప‌రిమితులు విధించినా.. కొంద‌రు భ‌ర్త‌లు మాత్రం ఏ మాత్రం ప‌ట్టించుకోని వైనం క‌నిపిస్తోంది. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. భార్య లావుగా మారింద‌న్న కార‌ణాన్ని చూపించి ట్రిపుల్ త‌లాక్ చెప్పేసి.. సంబంధం లేదంటున్న దారుణ వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని జాబువా జిల్లా మేఘాన‌గ‌ర్ షీరానీ మ‌హ‌ల్లాకు చెందిన ఆరిఫ్ హుసేన్.. స‌ల్మాబానోను ప‌దేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు..కుమార్తె ఉన్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో బ‌రువు పెరిగావంటూ భార్య‌పై స‌ల్మాన్ చెయ్యి చేసుకోవ‌టం ఎక్కువైంది.అత‌గాడి వేధింపులు భ‌రించ‌లేని ఆమె త‌న భ‌ర్త రోజూ కొడుతున్నాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

లావుగా ఉన్న కార‌ణంగా విడాకులు ఇస్తున్న‌ట్లుగా చెప్పి.. ట్రిపుల్ త‌లాక్ చెప్పారంటూ తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చింది. ముస్లిం మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ కొత్త‌గా వ‌చ్చిన వివాహ చ‌ట్టం 2018 అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా భ‌ర్త ట్రిపుల్ త‌లాక్ తో విడాకులు ఇచ్చిన‌ట్లుగా పేర్కొంది.

భార్య ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు భ‌ర్త ఆరిఫ్ పై ఐపీసీ సెక్ష‌న్ 323.. 498 కింద కేసు న‌మ‌దు చేశారు. ట్రిపుల్ త‌లాక్ ఇచ్చిన భ‌ర్త‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. భార్య లావుగా ఉంద‌న్న కార‌ణంగా చ‌ట్ట‌విరుద్దంగా ట్రిపుల్ త‌లాక్ చెప్ప‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



Tags:    

Similar News