మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. చర్చికి వెళితే ఆ ‘కులం’ పోదు

Update: 2021-10-08 03:25 GMT
మత భావాలను బూచిగా చూపించి రిజిర్వేషన్లకు కోత పెడదామంటే కుదరదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఆసక్తికరంగా మారాయి. పిటిషనర్ అయిన మహిళ హిందు పల్లన్ తల్లిదండ్రులకు పుట్టినా.. ఆమె చర్చికి వెళుతుందన్న పేరుతో ఆమెకు ఉన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసేయటానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తీర్పును మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ.. జస్టిస్ ఎం. దురైస్వామిల ధర్మాసనం వెల్లడించింది.

పిటిషనర్ హిందు వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళ. ఆమెకు కులధ్రువీకరణ ఎస్సీ కాగా.. ఆమె ఒక క్రైస్తవుడ్ని వివాహం చేసుకున్నారు. వారి పిల్లల్ని భర్త మతానికి చెందిన వారుగా గుర్తించటంతో పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేశారు. ఎందుకిలా అంటే.. పిటిషనర్ డాక్టర్ కావటంతో ఆమె ఆసుపత్రికి వెళ్లినప్పుడు.. ఆమె క్లినిక్ లో శిలువ గుర్తులు వేలాడుతూ కనిపించాయని.. అందుకు తాము కులధ్రువీకరణను తొలగించినట్లుగా చెప్పారు.

అయితే.. చర్చికి వెళ్లటం.. ఇంట్లో శిలువ గుర్తులు ఉన్నంతనే వారు క్రైస్తవాన్ని స్వీకరించినట్లుగా నిర్దారణకు రాలేమన్న  ధర్మాసనం.. ఊహాజనితంగా నిర్ణయాన్నితీసుకొని కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయటం సరికాదని స్పష్టం చేసింది. ఇప్పుడీ ఉదంతం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News