అధికారంలో ఎవరుంటే చాలు వారికి జీ హుజూర్ అన్నట్లుగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల కాలంలో పలు రాజకీయ పార్టీలు తరచూ ఆరోపిస్తున్న సీబీఐ మీద మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలోనూ కొన్ని అత్యున్నత న్యాయస్థానాలు సీబీఐ పని తీరు.. దానిపై ఉండే ఒత్తిళ్లపై వ్యాఖ్యలు చేసినా.. తాజాగా మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఆ పరిస్థితుల్లో మార్పులు రావాలంటే ఏం చేయాలన్న దానిపై తాజా సూచనల్ని కేంద్రానికి ఇచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలియాస్ సీబీఐ.. పార్లమెంటుకు మాత్రమే నివేదించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.
'సీబీఐ పంజరంలో బంధించబడిన చిలుక. దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్.. కాగ్ తరహాలో స్వయంప్రతిపత్తి కల్పించాలి. సీబీఐకి చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. దాన్ని అమలు చేయాలి. ఈ సెంట్రల్ ఏజెన్సీ స్వయంప్రతిపత్తితో వ్యవహరించటం కోసం తగిన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించింది. విపక్షాలు ఆరోపించినట్లుగా.. కేంద్రం చేతిలో రాజకీయ సాధనంగా మారిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. కీలక సూచనను చేసింది. తమిళనాడులో 300 కోట్ల రూపాయల పోంజీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. కిరుబాకరన్ మరియు జస్టిస్ బి పుగలెండి తమ తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
'సీబీఐని కాగ్ (కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్) మాదిరి స్వయంప్రతిపత్తి ఉండాలి. ఇది పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. అప్పుడే సీబీఐ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది' అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సరిదిద్దేందుకు వీలుగా పన్నెండు పాయింట్ల సూచల్ని చేసింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు సైతం ఒక కేసు విచారణ సందర్భంగా సీబీఐను పంజరంలో ఉన్న చిలుకగా పేర్కొందని.. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన వైనాన్ని గుర్తు చేసింది.
సీబీఐకు మరిన్ని అధికారాలు ఉండాలన్న అభిప్రాయాన్ని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 'చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సెంట్రల్ ఏజెన్సీ స్వయంప్రతిపతత్తి నిర్దారింపబడుతుంది. భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించటానికి మరింత అధికారం అవసరమని పేర్కొంది. ఈ ఏజెన్సీని 1941లో ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ ఏజెన్సీ ప్రధాని కార్యాలయంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు నివేదిస్తుంది. దీని డైరెక్టర్ ను ప్రధానమంత్రి.. భారత ప్రధాన న్యాయమూర్తి.. ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానల్ ఎంపిక చేస్తుందన్న విషయం తెలిసిందే.
వాస్తవానికి సీబీఐ స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన వ్యవస్థ. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇది ప్రభుత్వానికి లోబడి పని చేస్తుందన్న విమర్శలు.. ఆరోపణలు గడిచిన రెండు దశాబ్దాలుగా అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే సీబీఐను పంజరంలోని చిలుకగా అభివర్ణిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ.. ఎన్నికల కమిషన్ మాదిరి.. మరింత స్వతంత్రంగా ఉండాలని.. సీబీఐ డెరెక్టర్కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వాలని పేర్కొంది. సీబీఐను అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్).. స్కాట్లాండ్ యార్డు (యునైటెడ్ కింగ్ డమ్ విచారణ సంస్థ)కు ధీటుగా సీబీఐను ఏర్పాటు చేయాలని.. అందుకు అవసరమైన బడ్జెట్లు కేటాయింపులు జరపాలని ధర్మాసనం పేర్కొంది. మరి.. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.