ప్రధానికి లేఖ రాసిన సీఎం ఉద్ధవ్..ఎందుకంటే ?

Update: 2020-06-25 06:00 GMT
దేశంలో మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తుంది. వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజల్లో , ప్రభుత్వంలో ఆందోళన పెరిగిపోతుంది.  గడచిన 24 గంటల్లో 16,922 కొత్త కేసులు నమోదయ్యాయి. 418 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా 4,73, 105కు  పాజిటివ్ కేసులు చేరుకున్నాయి.

ఈ సమయం లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి  లేఖ రాశారు.  పీజీ మెడికల్ ఫైనల్ ఎగ్జామ్స్ ను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని ఆ లేఖ లో కోరారు. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ రెసిడెంట్ డాక్టర్స్  వైరస్ పోరు లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నేపథ్యంలో వారి సేవలు చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం జూలై 15 నుంచి ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. ఇకపోతే , మహారాష్ట్ర లో ఇప్పటి వరకు 1.50 లక్షలకి పైగా పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి.
Tags:    

Similar News