కూటమిలో గెలుపు బీటలు

Update: 2018-11-16 18:17 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది మహాకూటమి విజయావకాశాలు నానాటికి దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుపాటు అభ్యర్దుల ప్రకటన వంటి అంశాలు కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి. మహాకూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు అభ్యర్దుల ప్రకటన వంటి అంశాలపై తాత్సరం చేయడం తెలంగాణ జన సమితి నాయకులకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా వరంగల్ జిల్లా జనగామ నియోజక వర్గం పై మహాకూటమిలో వచ్చిన ప్రతిష్టంబన వీరి విజయాన్ని ప్రశ్నర్దకంగా మార్చింది. జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పోటి చేయాలని భావించారు.

మరో వైపు తెలంగాణ జన సమితి కూడా తమ పార్టీ అధ్యక్షుడు ప్రోఫెసర్‌ కోదండ రామ్‌ ను జనగామ నుంచే పోటి చేయించాలని నిర్ణయించింది. ఇక్కడే అసలు పీట ముడి ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ నుంచి - తెలంగాణ జన సమితి పై నుంచి కూడా ఒకే స్దానం నుంచి పోటి పడడంతో పరిస్దితి "చేయి" దాటింది. గడచిన రెండు మూడు రోజులుగా జనగామ టిక్కెట్టుపై కాంగ్రెస్ పార్టీపై మల్లాగుల్లాలు పడ్డారు. మహాకూటమిలో అన్నీ పార్టీలు త్యాగాలకు సిద్దం కావాలంటూ ప్రకటనలు చేసిన అవి కాంగ్రెస్‌ కు మినహా మిగత పార్టీలకే వర్తిస్తున్నాయని కూటమిలో ఇతర పక్షాలు విమర్శిస్తున్నాయి. జనగామ టిక్కెట్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై తెలంగాణ జన సమితి నాయకుడు కోదండ రామ్ అసహనం వ్యక్తం చేసారని సమాచారం. ఈ నియోజకవర్గంలో ఏర్పాడిన ప్రతిష్టంబనే రానున్న ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపుతుందని కోదండ రామ్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.  ప్రచారం - ఉమ్మడి మేనిఫెస్టో - కలసి పనిచేయడం వంటివి జరిగే పరిస్దితి లేదని - ఇది మహాకూటమి విజయాన్ని దెబ్బ తీస్తుందని తెలంగాన జన సమితి నాయకులు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. మహాకూటమిలో అన్నీ పార్టీలు త్యాగాలకు సిద్దం కావాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించడం కూటమిలో ఇతర పక్షాలకు ఇబ్బందిగా మారింది. "త్యాగాలు మేమే చేయాలా..కాంగ్రెస్ పార్టీ మాటలే తప్ప చేతలలో ఏమి చూపించదా..సీనియర్ నాయకులు అనే పేరుతో ఇలా రాజకీయాలు చేయడం సబబేన" అని తెలంగాణ జన సమితి నాయకుడు ఒకరు వ్యాఖ్యనించారు. ఈ ధోరణి మహాకూటమి మనుగడకు విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News