అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శిలాపూజ నిర్వహించడం అనే వార్త ఒక్కసారిగా అన్ని వర్గాలను ఆకర్షించింది. రామ మందిర నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాళ్లను సేకరించాలని గత జూన్ లో విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణం కోసం అవసరమైన రాళ్లు అయోధ్యకు చేరుకుంటున్నాయి. తొలి దఫాలో రెండు ట్రక్కుల రాళ్లు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్యకు తరలించారు. హిందూ అభిమానులు చేపట్టిన ఈ చర్యపై ఇతర వర్గాలు ఎలా స్పందిస్తాయో అనే ఆసక్తికర సందేహం అన్నివర్గాల్లోనూ జరిగింది. అయితే అనుకున్నట్లుగానే సదరు వర్గాలు స్పందించాయి.
రామ మందిరం నిర్మాణం కోసం అయోధ్యలోని రామ్ సేవక్ పురమ్ ప్రాంతానికి రాళ్లను చేరవేసినట్లు వీహెచ్ పీ ప్రకటించింది. రామ్ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నిత్యా గోపాల్ దాస్ శిలా పూజ కూడా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. అంతేకాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తున్నట్లు గోపాల్ దాస్ తెలిపారు. దీనిపై బాబ్రీమసీదు కూల్చివేత కేసులో వాది అయిన హషీం అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ తంతు ఆపించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో కల్లోల పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని అన్సారీ డిమాండ్ చేశారు. పలు వర్గాలు కావాలనే ఈ డిమాండ్ ను తెరమీదకు తెచ్చారని అన్సారీ వ్యాఖ్యానించారు.