కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదం మళ్లీ మొదలైంది. కర్నాటక లోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్ర లో విలీనం చేయాలన్న డిమాండ్ కొంచెం కొంచెం గా పెరిగి పోతుంది.దీనితో కర్నాటక అట్టుడికిపోతోంది. ఈ తరుణంలోనే తాజాగా మహారాష్ట్ర బీజేపీ కీలక నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ స్టాండ్ ని కూడా పక్కనపెట్టి కర్నాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కర్నాటక ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ ను కాదని, దానికి వ్యతిరేకం గా స్వరం పెంచారు.
కర్నాటక ఆక్రమిత మహారాష్ట్ర లో ఉండే మరాఠీ సోదరులకు మహారాష్ట్ర ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో పార్టీ, పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి అండగా ఉంటామని చెప్పారు. అలాగే బెల్గాం, కార్వార్ ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కర్నాటక ప్రభుత్వం తమ మరాఠీ సోదరులకు అన్యాయం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఫడ్నవీస్. మహారాష్ట్రలో నెలకొన్న సరిహద్దుల వివాదం సుప్రీంకోర్టులో ఉండగా దాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ విస్మరిస్తోందని మహారాష్ట్ర అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అంతేకాదు కర్నాటక కు మద్దతు గా కేంద్ర ప్రభుత్వం అడుగుతు వేస్తోందని మండి పడ్డారు. కర్నాటక మహారాష్ట్ర సరిహద్దుల వివాదం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఇది నడుస్తోంది.