మహారాష్ట్ర మంత్రిగారికి కోపం వచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. కట్టలు తెగిన కోపంతో ఊగిపోయిన ఆయన.. అక్కడే ఉన్న కాంట్రాక్టర్ పై చేయి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితి కారణం ఏమిటి? ఈ ఉదంతంలో మంత్రికి అంత కోపం ఎందుకు వచ్చింది? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవటం తెలిసిందే.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. పరిస్థితుల్లో మాత్రం మార్పు రాని పరిస్థితి. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. అకోలాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని చూశారు.
ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉన్న భోజనాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇందుకు బాధ్యుడైన కాంట్రాక్టర్ ను నిలదీసిన మంత్రి.. కోపంతో ఊగిపోతూ.. ఇలాంటి భోజనం పెడతారా? అంటూ సీరియస్ అయిన ఆయన.. అక్కడే ఉన్న కాంట్రాక్టర్ ను నిలదీశారు. అయితే.. సరైన సమాధానం చెప్పని కాంటాక్టర్ తీరుతో మరింత సీరియస్ అయిన ఆయన చేయి చేసుకున్నాడు. నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తున్న వైనంపై విచారణ జరపాలని అధికారుల్ని ఆదేశించారు.ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.