ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల మధ్య రంజుగా సాగుతున్న రాజకీయం ఇప్పుడు తన కొంప ముంచుతుందేమో అని తెగ టెన్షన్ పడుతోందట. శివసేన మెుండిపట్టుదలకు పోయి సీఎం సీటు తప్ప ఇంకేమీ వద్దని భీష్మించుకోవడంతో బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇక సాధ్యం కాదన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై కన్నేస్తోంది. దీంతో శివసేన ఇప్పటికే తన ఎమ్మెల్యేలను రంగ్ శారద హోటల్‌కు తరలించి కాపాడుకుంటోంది. దీంతో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునే ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించినట్లుగా వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఉండడంతో పాటు బీజేపీ ప్రయత్నాలను బయటపెట్టేందుకు ట్రై చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ నుంచి కాల్ వస్తే రికార్డ్ చేయాలని తమ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సూచించింది.
288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి మొన్న జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు బీజేపీ, 56 శివసేన గెలిచాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44, ఇతరులు 29 గెలిచారు. 145 మంది మద్దతుంటేనే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతుంది.
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ గడువు కూడా ఈరోజుతో ముగియనుంది. దీంతో ఈ రోజు దాటితే రాష్ట్రపతి పాలన అమలు చేయక తప్పని పరిస్థితి ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర రాజకీయం ఈ రోజు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.