జ‌గ‌న్ చ‌ట్టాన్నే మేం అమ‌లు చేస్తాం..కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ప్ర‌క‌ట‌న‌

Update: 2019-12-18 12:57 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి - వైసీపీ కార్య‌క‌ర్త‌లు - ఆయ‌న అభిమానులు ఖుష్ అయ్యే వార్త‌. ఢిల్లీ గ‌ద్దెను ఏలుతున్న‌ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పి ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి ప‌దేళ్ల కాలంలోపే రికార్డు స్థాయి మెజార్టీతో అధికారం చేసుకున్నందుకు మాత్ర‌మే కాదు...జ‌గ‌న్ బైబై చెప్పిన‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం...`మాకు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేసిన చ‌ట్టం బాగా న‌చ్చింది...దాన్నే మేం ఫాలో అవుతాం` అని ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల కూడా!

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...తెలంగాణ‌లో జ‌రిగిన‌ప్ప‌టికీ...దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలంగాణలో దిశ హత్యాచార ఉదంతంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం-2019ను అమ‌ల్లోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. దీని ప్రకారం - మహిళలు - బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా..నిర్దారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ చ‌ట్టంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.  అయితే, తాజాగా మ‌హారాష్ట్రలోని కాంగ్రెస్‌-శివ‌సేన‌-ఎన్‌సీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని తాము అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించాయి.

మ‌హారాష్ట్ర హోంమంత్రి ఏక్‌ నాథ్ షిండే తాజాగా మీడియాతో మాట్లాడుతూ - మహిళలు - చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల ప్రభుత్వం సీరియస్‌ గా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో మహిళలు - అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా జీవించాలనేదే తమ అభిమతమని ఏక్‌ నాథ్ షిండే అన్నారు.మహిళలపై జరిగే క్రూరమైన నేరాల్లో సత్వర న్యాయం అందించేందుకు ఏపీ దిశ యాక్ట్ మాదిరిగా చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై ప్రభుత్వం సీరియస్‌ గా ఆలోచిస్తుందని తెలిపారు.  చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో విచారణ కోసం 25 ప్రత్యేక కోర్టులు - 27 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.


Tags:    

Similar News