కర్నూలు లో వివాదంగా మారిన చెన్నంపల్లి కోటలో తవ్వకాల విషయం కొన్నాళ్లుగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు, ఆరోపణలు వస్తున్నా తవ్వకాలు యథేచ్ఛగా సాగుతుండడంతో దీని వెనుక ఉన్న బలమైన శక్తులెవరన్నది అంతటా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ తవ్వకాల వివాదంలో జాతిపిత మహాత్మాగాంధీ మనవడి పేరు కూడా చర్చలోకి రావడం విశేషం. ఈ తవ్వకాల్లో ప్రభుత్వ అధికారులతో పాటు మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ పాత్ర కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తుషార్ గాంధీ సలహాదారుగా ఉన్న సంస్థే తవ్వకాలు జరిపిస్తోందని చెప్తున్నారు.
డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ అనుబంధ కంపెనీ అయిన జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూల్ లో 1500 ఎకరాల్లో మినరల్స్ అన్వేషించేందుకు అనుమతి సంపాదించింది. జొన్నగిరి - ఎర్రగుడి ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేసేందుకు వారికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీనికి తుషార్ గాంధీ సలహాదారుగా ఉన్నారు.
కాగా ఇలాంటి వ్యవహారాల్లో ఎప్పుడూ చర్చకు రాని తుషార్ గాంధీ పేరు ఇందులో వినిపిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలను నడుపుతున్నవారు వ్యూహాత్మకంగా తుషార్ గాంధీని నియమించుకున్నారని.. తవ్వకాలకు ఆటంకాలు రాకుండా - స్థానికంగా అభ్యంతరాలు రాకుండా ఉండడానికి నమ్మకకమైన వ్యక్తి పేరు వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన్ను నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తుషార్ గాంధీకి ఈ సంస్థల కార్యకలాపాలన్నీ తెలుసా.. లేదంటే ఆయనకు కూడా ఇతర కారణాలు చెప్పి ఇలాంటి గుప్త నిధుల వేట సాగిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.