సినీ విమర్శకుడు - బిగ్ బాస్ తో పాపులర్ అయిన క్రిటిక్ కత్తి మహేష్ తన విమర్శల జోరును మరింత పెంచుతున్నారు. ఇప్పటివరకు జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై - అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించి...వివాదాల్లో చిక్కుకున్న కత్తి మహేష్ తాజాగా తన గురిని టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యేపై బాలకృష్ణ వైపు మళ్లించారు. తాజాగా బాలయ్య ప్రవర్తన తీరుపై పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తూ...ఆయన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వ్యాఖ్యానించారు.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్యబాబుపై స్పందించిన కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఇంకా రాజులు రాజవంశాలు ఉన్నట్లు.. తాను ఓ రాజు అయినట్లు.. తమ వంశం మాత్రమే గొప్పదైనట్లు ఫీలవుతున్నాడని కత్తి విమర్శించాడు. అంతేకాకుండా ఆయన ప్రవర్తన వివాదాస్పదం అవుతోందన్నారు. అభిమానుల్ని కొట్టడం అలవాటుగా మార్చుకున్న బాలయ్యకు హాస్పిటల్ కు తీసుకెళ్లి సైక్రియాట్రిస్టుతో కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరముందని ఎద్దేవా చేశారు. తద్వారా పరోక్షంగా బాలయ్యను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాలని కత్తి అభిప్రాయపడ్డాడు. ఇదే సందర్భంలో బాలయ్య ఎమ్మెల్యే గిరీపై కూడా కత్తి స్పందించాడు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వ్యవహరించాల్సిన విధానం ఇది కాదని అన్నారు.
ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడిన బాలయ్య...ఆ హోదాలో జనాల్ని, ఫ్యాన్స్‌ను కొట్టడం ఏంటని కత్తి మహేష్ ప్రశ్నించారు. మనుషుల్ని.. ముఖ్యంగా అభిమానుల్ని కొట్టడం అనైతికమని...ఇది సభ్యత కాదని.. ఆ హక్కు ఆయనకు లేదని కత్తి స్పష్టం చేశారు. ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్న బాలయ్యకు మెడికల్ కౌన్సెలింగ్ అవసరమని వ్యాఖ్యానించారు. బాలయ్యను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి.. సైక్రియాట్రిస్టుతో చికిత్స చేయించాల్సిన అవసరముందని కత్తి అభిప్రాయపడ్డాడు. తద్వారా బాలయ్య మానసిక స్థితిపై సెటైర్లు వేశారు కత్తి మహేష్.