మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తృటిలో పెను ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక విందు కార్యక్రమానికి హోటల్ కు వెళ్లిన ఆయన.. తిరిగి వచ్చే క్రమంలో లిఫ్ట్ ఎక్కగా.. మధ్యలో లిఫ్ట్ వైర్ తెగిపోవటంతో ఆయన కాలికి ఫ్యాక్చర్ అయ్యింది. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
చిక్కడపల్లి సాయికృప హోటల్ లో టీఆర్ఎస్ నేత ఎర్రం శ్రీనివాస్ గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమం జరిగింది. హోటల్ నాలుగో అంతస్తులో ఈ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హాజరయ్యారు. తిరిగి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేను సాగనంపేందుకు మైనంపల్లితో పాటు పలువురు లిఫ్ట్ ఎక్కారు.
నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు చేరుకున్నంతనే ఒక్కసారిగా లిఫ్ట్ వైరు తెగిపోవటంతో లిఫ్ట్ వేగంగా కిందపడింది. ఊహించని పరిణామానికి నేతలంతా ఒక్కసారి షాక్ అయ్యారు. ఈ ఘటనలో మైనంపల్లి హన్మంతరావు ఎడమ కాలు తొడ వద్ద గాయమైంది. ఆయన్ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కట్టు కట్టి ఇంటికి పంపారు.
ఎమ్మెల్యే తో పాటు లిఫ్ట్ లో ఉన్న వారంతా గాయాలపాలయ్యారు. ఒకరికి కాలుకు.. మరొకరికి మెడకు.. ఫంక్షన్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గుప్తాకు నడుముకు గాయాలయ్యాయి. షాకింగ్ విషయం ఏమంటే.. ఇదే హోటల్లో గతంలోనూ లిఫ్ట్ వైర్ తెగి పడిన ఉదంతం చోటు చేసుకుంది.