తెలంగాణ ఎంపీ హాట్‌ కామెంట్స్‌

Update: 2015-11-02 07:45 GMT
దేశంలోనే అత్య‌ధిక ఓట‌ర్లున్న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండోస్థానంలో ఉన్న‌ మ‌ల్కాజ్‌ గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎంపీ మల్లారెడ్డి మరోమారు త‌న ఆస‌క్తిక‌ర‌, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. గ‌తంలో త‌న పెద్ద‌రీకం గురించి విద్యార్థుల‌కు సందేశాలు ఇచ్చిన మ‌ల్లారెడ్డి ఇపుడు జీవితంలో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పారు. అందులో త‌ప్పేముంది అంటారా?  ఇలా సెటిల్ అయ్యేందుకు ప్రేమ‌ను ఎలా ఎర‌గా వేయాలో ఆయ‌న బోధించారు.

ఎంపీ అయినప్ప‌టికీ తన కాలేజీల్లో జరిగే కార్యక్రమాలలో ఓపెన్‌ గా మాట్లాడే మ‌ల్లారెడ్డి ఇపుడు మ‌రో ముంద‌డుగువేశారు. చిన్న‌వ‌య‌సులోనే ప్రేమ‌లు అంటూ రోడువెంట పోయే వారిని, ఎవ‌రిని ప‌డితే వారిని ప్రేమించ‌వ‌ద్ద‌ని సూచించారు. 30 ఏళ్లు దాటిన త‌ర్వాతే పెళ్లిళ్లు చేసుకోవాల‌ని అది కూడా రిచ్‌ గా ఉన్న వాళ్ల‌ని "ప‌ట్టాలి" అని చెప్పారు. ప్ర‌పంచ‌ అందగత్తె అయిన ఐశ్వర్యారాయ్... స‌ల్మాన్‌ ఖాన్‌ - షారుక్‌ ఖాన్ వంటివారు ఎంత మంది వెంటపడ్డా పట్టించుకోకుండా 33 ఏళ్లు ఎదురు చూసి బిగ్‌బీ అమితాబ్ కొడుకును పట్టిందని చెప్పారు. దేశంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా ఉన్న సోనియాగాంధీకి ఆ స‌త్తా ఎలా ద‌క్కింద‌ని ప్ర‌శ్నిస్తూ ఇటలీ వ్య‌క్తి అయినప్ప‌టికీ దేశంలో ప్ర‌ముఖ కుటుంబం అయిన రాజీవ్ గాంధీని పట్టడం వ‌ల్లేన‌ని చెప్పారు.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ ఆళ్ల‌ని...ఈళ్ల‌ని చేసుకోకుండా ఆపోలో గ్రూప్ చైర్మ‌న్‌ ప్రతాప్ రెడ్డి మనవరాలిని పట్టాడని ఉద‌హ‌రించారు. కొడితే అలా జాక్ పాట్ కొట్టాలని సందేశం ఇచ్చారు. లేదంటే జీవితం వృథా అయిపోవ‌డం తప్ప మేర‌మీ ఉండ‌ద‌ని చెప్పారు. ఇదీ మ‌ల్లారెడ్డి గారి హిత‌బోధ‌.
Tags:    

Similar News