మ‌ల్లాడి ఎఫెక్ట్‌.. మంత్రి ప‌ద‌వి మిస్ చేసుకున్న కీల‌క నాయ‌కుడు

Update: 2022-04-16 01:54 GMT
రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. ఎవ‌రు శ‌తృవులో .. ఎవ‌రు మిత్రులో తెలుసుకునేలోగా.. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపో తుంది. ఇప్పుడు ఇదే మాట‌.. వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే మ‌త్య్స కార సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. పొన్నాడ స‌తీష్ అనుచ‌రులు చెబుతున్నారు. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీత‌ర‌ఫున పోటీ చేసి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. అస‌లు.. ఈయ‌న వైసీపీలో చేరికే ఒక అద్భుతం. పొరుగున ఉన్న పుదుచ్చేరిలో మంత్రిగా ప‌నిచేసిన‌.. మ‌ల్లాడి కృష్నారావు.. రాజ‌కీయాల్లోకి తీసుకు వ‌చ్చారు.

వైఎస్‌తో మ‌ల్లాడికి ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌తో భేటీ ఏర్పాటు చేసి మ‌రీ.. పొన్నాడ‌ను పార్టీలో చేర్చారు. అంతేకాదు.. కీల‌క‌మైన స‌ల‌హాలు కూడా ఇచ్చేవార‌ని.. పేరుంది. ఇక‌, పొన్నాడ కూడా మ‌ల్లాడి బాట‌లోనే ముందుకు సాగారు. అయితే.. ఇప్పుడు ఇదే మ‌ల్లాడి.. పొన్నాడ‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం.. అంద‌కే ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని అంటుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

గ‌తంలోనే ద‌క్కాల్సి ఉన్నా..

వాస్త‌వానికి మ‌త్య్స‌కార కోటాలో వైసీపీ త‌ర‌ఫున ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే గెలిచారు. ఒక‌రు శ్రీకాకుళంలోని ప‌లాస నుంచి గెలిచిన ప్ర‌స్తుత మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు. రెండు.. పొన్నాడ స‌తీష్‌. అయితే.. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా రేప‌ల్లి నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ కూడా మ‌త్స్య కార వ‌ర్గ‌మే అయినా.. ఆయ‌న ఓడిపోయారు. ఈ క్ర‌మంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని పొన్నాడ అనుకున్నారు. అయితే.. ఓడిపోయినా.. గ‌తంలో ఉన్న ప‌రిచ‌యాలు.. ఆర్థిక బంధాల నేప‌థ్యంలో మోపిదేవికి.. జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇచ్చి మ‌రీ మంత్రిని చేసుకున్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించినా.. సీదిరిని తీసుకున్నారు. దీంతో తొలి కేబినెట్‌లో పొన్నాడ‌కు అవ‌కాశం చిక్క‌లేదు.

2.0లో ఛాన్స్ ఇలా మిస్స‌యిందా?
తొలి కేబినెట్‌లో అవ‌కాశం చిక్క‌క‌పోవ‌డంతో ఈసారి జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో  తప్పకుండా ఛాన్స్‌ ఇస్తారని పొన్నాడ వ‌ర్గం భావించింది.  చివరి వరకు ఆయన పేరు రేస్‌లో ఉంది కూడా. ఏమైందో ఏమో లాస్ట్‌మినిట్  పొన్నాడ పేరు మిస్‌. దీంతో పొన్నాడుకు మంత్రి పదవి రాకపోవడానికి కారణంపై చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనికి ప్ర‌ధాన కారణం పొన్నాడ తన వంతు ప్రయత్నాలు చేయ‌క‌పోవ‌డ‌మ‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. అదేస‌మ‌యంలో  పొన్నాడకు రాజకీయ గురువు.. పుదుచ్చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా కార‌ణ‌మ‌ని అంటున్నారు.

కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన పుదుచ్చేరి ఎన్నిక్ల‌లో మ‌ల్లాడి యానాం నుంచి పోటీ చేశారు. దీనికి జ‌గ‌న్ పొన్నాడ‌ను ప్ర‌చారం కోసం పంపించారు. అయితే.. మల్లాడికి వ్యతిరేకంగా పొన్నాడ ప్రచారం చేసి అశోక్‌ ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారనే అనుమానాలు ఉన్నాయట. అప్పటి నుంచి పొన్నాడకు ఆయన రాజకీయ గురువు మల్లాడికి మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది.  యానాం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మల్లాడి.. ఎమ్మెల్యే పొన్నాడ ఆశలకు చెక్‌ పెట్టారని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గ రేసు నుంచి ఆయ‌నే పొన్నాడ పేరు ను తీసేయించార‌ని అంటున్నారు.  

పొన్నాడ వర్గీయులు గుర్రు మంత్రివర్గం కూర్పుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే పొన్నాడకు కేబినెట్‌లో చోటు దక్కబోదని మల్లాడి వర్గం ప్రచారం చేసిందట. చివరకు అదే నిజమైంది. దీంతో ఎమ్మెల్యే పొన్నాడ వర్గీయులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.  ఏదేమైనా.. గురువు ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్‌తో పొన్నాడ రాజ‌కీయం యూట‌ర్న్ తిరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News