గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి... తనకు ఇష్టమైన నేత వద్దకు వచ్చేసిన బెజవాడ సీనియర్ రాజకీయవేత్త మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పక్కా క్లారిటీ ఉందనే చెప్పాలి. ఎందుకంటే... మల్లాది విష్ణు వైసీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చిన సందర్భంగా మొన్న అంత స్పష్టంగా ఏమీ చెప్పని ఆయన... కేవలం ఒక్కటంటే ఒక్క రోజు వ్యవధిలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే ఆయన వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. పొద్దున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మల్లాది... సాయంత్రానికంతా లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిలో ప్రత్యక్షమైపోయారు. అంటే పార్టీ మారుతున్నప్పుడు... అప్పటిదాకా కొనసాగిన పార్టీకి రాజీనామా చేయాలన్న నిబంధనను తూచా తప్పకుండా పాటించిన మల్లాది... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే జగన్ ఇంటికి బయలుదేరారు.
విజయవాడ నుంచి భారీ అనుచర గణంతో బయలుదేరిన మల్లాది విష్ణు... నేరుగా హైదరాబాదులోని జగన్ ఇంటికి చేరుకున్నారు. జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన మల్లాది... ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడే మీడియాతో మాట్లాడుతూ... తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, త్వరలోనే వైసీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. అసలు తాను పార్టీ మారడానికి గల కారణాలను ఆయన వివరిస్తూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో అచారక పాలన నడుస్తోందని స్పష్టం చేశారు. టీడీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలంటే వైఎస్ జగన్ సీఎం కావాల్సిందేనని కూడా మల్లాది చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఓ చారిత్రాత్మక అవసరమని కూడా మల్లాది తన మదిలోని మాటను చెప్పేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు 1980 నుంచీ అనుబంధం ఉందనీ, ఆయన తనను ఎంతో ఆత్మీయంగా చూసేవారని చెప్పారు. ఇపుడు ఆయన తనయుడు జగన్ నాయకత్వం కింద పని చేయాలని పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని విజయవాడలో సభను ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని చెప్పారు. అయినా తానేమీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి చేరడం లేదని కూడా మల్లాది చెప్పారు. అసలు ఆ విషయంపై జగన్‌తో చర్చించలేదని కూడా చెప్పడం ఇక్కడ గమనార్హం.
రాష్ట్రంలో మంచి పాలన కోసమే జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నానని, ఆ ఉద్దేశ్యంతోనే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక మల్లాది రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీతోనే ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లాది... ఆ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడిగానే కాకుండా... ఉడా చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా గతంలో పలు బాధ్యతలు చేపట్టారు. గడిచిన మూడేళ్లుగా విజయవాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై ముమ్మరంగా పోరాటాలు నిర్వహించారు. ఇన్నేళ్ల పాటు తనకు ఆశ్రయమిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయన పార్టీని విడనాడుతున్న సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.