గవర్నర్ వర్సెస్ సీఎం: బ్లాక్ చేసి షాక్ ఇచ్చిన మమత

Update: 2022-01-31 17:30 GMT
ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. బీజేపీ ప్రతిపాదించిన గవర్నర్.. తమ వ్యతిరేకులైన సీఎం పట్ల వ్యవహరిస్తున్న తీరుతో టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగుతోంది. ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్‌లో రగులుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ గవర్నర్ జగదీప్‌ను ట్విట్టర్‌లో ఆయనను బ్లాక్ చేసి షాక్ ఇచ్చారు.

మమత బెనర్జీ చర్య వెనుక అనేక కారణాలు ఉన్నాయి.  మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం గవర్నర్ జగదీప్ ఆయనకు నివాళులర్పిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రజాస్వామ్యంలో గ్యాస్‌ చాంబర్‌గా మారుతోందని ఆడిపోసుకున్నారు.  అలాగే సోషల్ మీడియాలో గవర్నర్ జగదీప్ నేరుగా సీఎం మమత, టీఎంసీ మంత్రులను టార్గెట్ చేశారు. దీనిపై సీరియస్ అయిన మమత బెనర్జీ అతడిని ట్విట్టర్‌లో బ్లాక్ చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని సీఎం మమత పేర్కొంటూ.. ‘గత ఏడాది కాలంగా ఓపికగా బాధపడుతున్నాం. గవర్నర్ మాట వినడం లేదని, అందరినీ బెదిరిస్తున్నారన్నారు. నేను చిరాకు పడుతున్నాను. అందుకే బ్లాక్ చేశాను" అని తెలిపింది.

గవర్నర్‌ను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తొలగించాలంటూ ప్రధానికి లేఖ రాసినా చర్యలు తీసుకోలేదని మమత అన్నారు. “గవర్నర్ అనేక ఫైళ్లను క్లియర్ చేయలేదు. ప్రతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నాడు. అతను విధాన నిర్ణయాల గురించి ఎలా మాట్లాడగలడు?’’ అని మమతను ప్రశ్నించారు.

మమత వ్యాఖ్యలపై గవర్నర్ జగ్‌దీప్ మరోసారి ట్విటర్‌లో స్పందిస్తూ, “రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం రాజ్యాంగ నిబంధనలు -చట్ట నియమాలను రాష్ట్రంలో ఎవరూ అడ్డుకోకుండా చూడాలని.. అధికారంలో ఉన్నవారు నిజమైన విశ్వాసం.. విధేయతను కలిగి ఉండాలని హితబోధ చేశారు. ఇదే భారత రాజ్యాంగం" అని మమతకు కౌంటర్ ఇచ్చారు.

గవర్నర్-సీఎం పంచాయితీ బెంగాల్ రాష్ట్రంలో రచ్చరచ్చ అవుతోంది.  గవర్నర్ జగదీప్ తన అధికారాల కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మమత బెనర్జీ అతడిపై ధైర్యంగా పోరాడుతోంది. ఇది వీరి మధ్య వైరానికి దారితీస్తోంది.
Tags:    

Similar News