అందుకే సౌరవ్ గంగూలీని తప్పించారు: మమతా బెనర్జీ

Update: 2022-10-20 23:30 GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీ ఆడిన ఆటలో బలైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు   సౌరవ్ గంగూలీకి మద్దతుగా నిలిచారు. బీసీసీఐ చీఫ్‌గా అతని పదవీకాలాన్ని పొడిగించకపోవడం వెనుక బీజేపీ పెద్దల కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.  గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా నియమించారు.

సౌరవ్ గంగూలీ నవంబర్ 19, 2019న బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంతకుముందు ఢిల్లీలో బీసీసీఐ ప్రముఖుల సమావేశం తరువాత, గంగూలీ ఇకపై అధ్యక్ష పదవికి పోటీ చేయరని నిర్ధారించారు.. దీంతో సౌరవ్ గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పంపాలని మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

గంగూలీకి బీసీసీఐ చీఫ్‌గా రెండోసారి అవకాశం లేకుండా పోయిందని ’ మమత అన్నారు. "ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గంగూలీని ఎందుకు అనుమతించలేదు? ఎవరైనా పోటీ చేసేందుకు వీలుగా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఇది సౌరవ్‌కు చాలా అన్యాయం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గంగూలీని ఇలా బీసీసీఐకి, ఐసీసీకి కాకుండా చేయడం కుట్ర’ అని మమత ఆరోపించారు. .

సౌరవ్ బీసీసీఐ చీఫ్ గా నూటికి నూరు పాళ్లు అర్హులు. దేశం గర్వించేలా ఉండేవాడు. అతన్ని దూరం చేయడానికి కారణం ఏమిటి? ఆ పదవిని మరొకరికి కట్టబెడుతున్నారు. నేను కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు.  స్వార్థ కారణాలు తెలుపాలని ఆమె డిమాండ్ చేశారు. సచిన్ టెండూల్కర్ పోటీలో ఉంటే, నేను కూడా అతనికి మద్దతు ఇచ్చేవాడినని.. కానీ ఆయన పోటీలో లేకున్నా గంగూలీని ఎందుకు తప్పించారని మమత ప్రశ్నించారు.

‘’కాగా గంగూలీ తనను పదవి నుంచి దింపేయడంపై ఏమీ మాట్లాడలేదని.. అతను బాధపడ్డాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఫలానా వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది సిగ్గులేని రాజకీయ పగ” అని మమత బెనర్జీ నిప్పులు చెరిగారు.

గంగూలీ స్థానంలో 1986  ప్రపంచకప్ విజేత రోజర్ బిన్నీ  బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు భారత మాజీ ఆల్ రౌండర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గంగూలీని తొలగించడం వెనుక తండ్రీకొడుకులైన బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News