మమ‌త రూపురేఖ‌ల్లో దుర్గామాత విగ్ర‌హాలు, బీజేపీ గ‌గ్గోలు!

Update: 2021-09-04 02:00 GMT
ప‌శ్చిమ బెంగాల్ లో ద‌స‌రా ఉత్స‌వాలు ఏ రేంజ్ లో జ‌రుగుతాయో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. బెంగాల్ సంస్కృతితో ద‌స‌రా ఉత్స‌వాలు ముడిప‌డిపోయాయి. ద‌స‌రా ఉత్స‌వాలు బెంగాల్ సంస్కృతికి ప్ర‌తీక‌గా మారాయి.  వీటితో అక్క‌డి సామాజిక‌, రాజ‌కీయ అంశాలు కూడా ముడిప‌డిపోవ‌డంలో వింత ఏమీ లేదు. బెంగాల్ రాజ‌కీయాల్లో కూడా దుర్గా మాత‌ను నినాదంగా మార్చేశారు ఇప్ప‌టికే. బీజేపీ వాళ్లు దేశ వ్యాప్తంగా జైశ్రీరామ్ అంటూ రాముడిని రాజ‌కీయ నినాదంగా మార్చుకుంటే, ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు బెంగాల్ లో మమ‌తా బెన‌ర్జీ జై కాళీ మా అంటూ నిన‌దించింది.

జై శ్రీరామ్ నినాదాన్ని జై కాళీ మా నినాదంతో ఎదుర్కొంది మ‌మ‌త‌. త‌ను బ్ర‌హ్మ‌ణ కులానికి చెందిన‌దాన్ని అంటూ, కాళీ మాత భ‌క్తురాలినంటూ హిందుత్వ ఓటుకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆస్కారం లేకుండా చేసుకుంది మ‌మ‌త‌. ఇక ఇదే ఊపులో మ‌మ‌త ఫాలోయ‌ర్లు మ‌రో అడుగు ముందుకు వేశార‌ట‌. ఈ సారి ద‌స‌రా ఉత్స‌వాల కోసం త‌యారు చేసుకుంటున్న అమ్మ‌వారి విగ్ర‌హాల్లో మ‌మ‌త రూపురేఖ‌లు కొట్టొచ్చిన‌ట్టుగా ఉండేలా చూసుకుంటున్నార‌ట‌.

కొన్ని క‌మిటీలు ఈ మేరకు రెడీ అయిపోయాయ‌ట‌. పూజ‌ల కోసం పెట్టే అమ్మ‌వారి విగ్ర‌హాల్లో మ‌మ‌త రూపురేఖ‌లు క‌నిపించేలా చూసుకోవ‌డ‌మే వారి ప‌ని. ఈ వ్య‌వ‌హారం స‌హ‌జంగానే బీజేపీకి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ఈ విష‌యాన్ని బెంగాళీ బీజేపీ నేత‌లు ఆక్షేపిస్తున్నారు. అమ్మ‌వారి విగ్ర‌హాల్లో మ‌మ‌త రూపు రేఖ‌లు ఏమిట‌ని మండిప‌డుతున్నారు. అయితే ఆ క‌మిటీలు మాత్రం వెన‌క్కుత‌గ్గ‌మంటున్నాయ‌ట‌. మమ‌తా బెన‌ర్జీ అంటే మ‌రెవ‌రో కాదు.. అప‌ర కాళిక అవ‌తారం అంటున్నార‌ట‌!

అయినా బీజేపీ వాళ్లు కూడా చాలా చెప్పారుగా, మోడీ అంటే మ‌రెవ‌రో కాదు.. శ్రీరాముడి మ‌రో అవ‌తారం అంటూ కూడా కొంత‌మంది బీజేపీ నేత‌లు స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు మ‌మ‌తా బెన‌ర్జీని అప‌ర‌కాళిక మ‌రో అవ‌తారం అంటున్నారు కొంత‌మంది బెంగాళీ వాళ్లు. చెల్లుకు చెల్లా?  లేక హిందూ దేవుళ్ల‌ను రాజ‌కీయాల కోసం ఎవ‌రికి తోచిన‌ట్టుగా వారు వాడుకోవ‌డం అనుకోవాలా?
Tags:    

Similar News