హిందీ స‌రిగా మాట్లాడ‌లేద‌ని... సీఎం అరెస్ట్‌!

Update: 2019-02-03 07:51 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు- ప్ర‌తి విమ‌ర్శ‌ల జోరు పెరుగుతోంది. సంద‌ర్భం ఏదైనా ఆయా పార్టీలు ప్ర‌త్య‌ర్థుల‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఒర‌వ‌డిలో భాగంగా, తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర విమ‌ర్శ‌లు సాగాయి. ఎన్నికల ర్యాలీలో భాగంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీదీ ఇక దిగిపొండి, ఆయుష్మాన్‌ భారత్‌కు నో చెప్పిననాడే మీ పతనం మొదలయిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను తిప్పికొట్టారు. మరో నెల రోజుల్లో అధికారాన్ని కోల్పోతారని తెలిసినా.. మోడీ అందుకు మానసికంగా సిద్ధం కాలేకపోతున్నారని విమర్శించారు.

అంశాల వారీగా మోడీని ఆమె తిప్పికొట్టారు. ఏ తప్పు చేయకుంటే మమతకు భయమెందుకన్న మోడీ ప్రశ్నకు 2002 గుజరాత్‌ లో అల్లర్ల జరిగిన మాట వాస్తవం కాదా అని కౌంటర్‌ ఇచ్చారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో మోడీ నేరస్తుడు కాబట్టే...సీబీఐ ఆయన్ని ప్రశ్నించిందని అన్నారు. ``మోడీది నియంతృత్వ శైలి. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతీ వారిని తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి విషయాల్లో కేంద్రం గత నాలుగునెలల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికారం కోల్పోతామని తెలిసినా మోడీ అందుకు మానసికంగా సిద్ధపడటం లేదు. ఈ విషయాన్ని చెప్పకూడదు కానీ..తప్పక చెబుతున్నా. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కుమారుడిపై కూడా ఎఫ్ ఐఆర్‌ నమోదైంది. మోడీకి దేశంలో మిత్రులెవ్వరూ లేరు. తనను తానే ఫ్యాషన్‌ అన్నట్లుగా ఉంటారు. ఆయనకేదీ చేతగాదు. టెలిఫోన్‌ లోనూ సొంతంగా మాట్లాడలేరు`` అని మమత విమర్శించారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కేంద్ర పథకాలను అమలు చేయడం లేదన్న మోడీ విమర్శలను తిప్పి కొడుతూ...కేంద్ర ప్రభుత్వమే తమ రాష్ట్రంపై శీతకన్ను వేసిందని...నిధుల కేటాయింపులోనూ అలసత్వం వహిస్తోందని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్‌ చేసేందుకు ప్రధాని మోడీ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ``ఒకవేళ మోడీ పంపించిన అధికారులు నన్ను అరెస్ట్‌ చేసినా పర్వాలేదు. నా హిందీ బాగోలేకుంటే.. వాళ్లు నన్ను అరెస్ట్‌ చెయ్యొచ్చు. వారికది అలవాటేగా! నేను అధికారులను తప్పుబట్టను. వారిని కేంద్రం బలవంతంగా చేస్తోంది. ఏదైనా చేయండి. ఏదైనా చేయండి ప్రతిపక్షాలను ప్రజలకు దూరం చేయండి. అని నరేంద్రమోడీ తన ఇంటి వద్ద ఉండే అధికారులకు సమన్లు ఇచ్చారు. దర్యాప్తు సంస్థలు నా ఇంటి పని మనిషిని ప్రశ్నిస్తామన్న పర్వాలేదు``.. అని అంటూ మోడీకి చురకలంటించారు.

Tags:    

Similar News