బెంగాల్ లోని బంగ్లాదేశీలంతా ఇండియ‌న్సే..మమ‌త ప్ర‌క‌టన‌!

Update: 2020-03-04 07:00 GMT
ఒక‌వైపు ప‌క్క దేశాల్లోని ముస్లింలను ఇండియాలోకి తీసుకునే స‌మ‌స్యే లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ ఉంది. పాక్, బంగ్లా వంటి దేశాల నుంచి హిందువులు, సిక్కులు, క్రిస్టియ‌న్లు భార‌త పౌర‌స‌త్వం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు, అదే ముస్లింల‌కు మాత్రం ఆ అవ‌కాశ‌మే లేద‌ని మోడీ ప్ర‌భుత్వం అంటోంది. ఈ విష‌యంలో చట్టాన్ని తెచ్చింది. అందుకు సంబంధించిన దుమారం కొన‌సాగుతూ ఉంది. దీని వ‌ల్ల ఇప్ప‌టికే ఇండ‌యాలో సెటిలైన ప‌క్క దేశాల ముస్లింలకు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలున్నాయి.

ఇలాంటి నేప‌థ్యంలో అలాంటి వారు గ‌ట్టిగా ఉన్న ప‌శ్చిమ బెంగాల్ లో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతూ ఉంది. మోడీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని, చ‌ట్టాన్ని బెంగాల్ లోని అధికార పార్టీ టీఎంసీ గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తూ ఉంది. ఆ పార్టీ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్ప‌టికే ఈ విష‌యాల‌పై ఘాటుగా స్పందించారు. ఈ క్ర‌మంలో ఆమె మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌మ‌త సూటిగా, సుత్తి లేకుండా చెబుతున్న‌ది ఏమిటంటే.. ప‌శ్చిమ బెంగాల్ లో ఉన్న బంగ్లాదేశీయులంతా ఇండియ‌న్సే అని మ‌మ‌త తేల్చేసింది. చాలా కాలం కింద‌టే ఇండియాలోకి వ‌చ్చిన బంగ్లాదేశీయులు చాలా మంది బెంగాల్ లో ఓట‌ర్ కార్డులు, రేష‌న్ కార్డుల‌తో స‌హా అన్నింటినీ పొంది ఉంటారు. వారంద‌రూ భార‌తీయులే అని మ‌మ‌త అంటున్నారు. ఎవ‌రికైతే ఓట‌ర్ కార్డులున్నాయో, ఎవ‌రికి అయితే ఇత‌ర సౌక‌ర్యాలు, స‌దుపాయాలున్నాయో, ఎవ‌రైతే ఓటు హ‌క్కును వినియోగించుకుని బెంగాల్ కు ముఖ్య‌మంత్రిని, భార‌త దేశానికి ప్ర‌ధాన‌మంత్రిని ఎన్నుకున్నారో.. వారంతా భార‌తీయులే అని మ‌మ‌త అంటున్నారు.

ప‌శ్చిమ బెంగాల్ లో భారీ ఎత్తున బంగ్లాదేశీయులు ఓటు హ‌క్కును క‌లిగి ఉంటార‌నే విష‌యం పాత‌దే. ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో చాలా మంది బంగ్లా నుంచి వ‌చ్చి ఓటు వేస్తార‌ని బీఎస్ఎఫ్ వాళ్లు కూడా చెబుతూ ఉంటారు. ఇలాంటి నేఫ‌థ్యంలో ఓటు హ‌క్కు క‌లిగిన బంగ్లాదేశీయులంతా ఇండియ‌న్సే అని మ‌మ‌త ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిదాయ‌కంగా మారింది. దీనిపై కేంద్రం ఏమంటుందో!


Tags:    

Similar News