కేసీఆర్ ట‌చ్ లో ఉన్నార‌న్న దీదీ!

Update: 2019-02-15 05:37 GMT
మోడీకి వ్య‌తిరేకంగా జ‌ట్టు క‌ట్టిన విప‌క్ష కూట‌మిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేక‌పోవ‌టం తెలిసిందే. ఈ విష‌య‌మై ప‌లుమార్లు చ‌ర్చ‌కు కూడా వ‌చ్చింది. ఒక‌వైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్‌.. బీజేపీయేత‌ర కూట‌మిని ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌ను కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో భాగంగా ఇప్ప‌టికే ప‌లురాష్ట్రాల్లో ప‌ర్య‌టించి.. అక్క‌డి బ‌ల‌మైన పార్టీ అధినేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అలాంటి జాబితాలో ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంత‌రం మ‌ళ్లీ క‌నిపించ‌ని కేసీఆర్ వ్య‌వ‌హారాన్ని తాజాగా మ‌మ‌త చెప్పుకొచ్చారు.

బీజేపీ స‌ర్కారును గ‌ద్దె దించ‌టానికి కూట‌మిగా కూడ‌గ‌డుతున్న మ‌మ‌త తాజాగా కేసీఆర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని.. ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను కూడా గౌర‌విస్తామ‌ని చెప్పారు. మ‌మ‌త మాట‌ల‌కు మీడియా అడ్డుప‌డుతూ కేసీఆర్‌.. న‌వీన్ లు విప‌క్ష కూట‌మిలో చేర‌టం లేదు క‌దా? అన్న‌ప్పుడు.. వెయిట్ చేయండంటూ ఆమె న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య చేయ‌టం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ఉండేందుకు ఎన్నిక‌ల ముందు జాతీయ స్థాయిలో కూట‌మిగా ఏర్ప‌డ‌నున్న‌ట్లుగా చెప్పారు. కూట‌మి నేత ఎవ‌ర‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల త‌ర్వాతే తాము వెల్ల‌డిస్తామ‌న్న మ‌మ‌త‌.. రాష్ట్రాల్లో స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా పొత్తులు ఉంటాయ‌ని.. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌న్నారు.

వామ‌ప‌క్షాల‌తో మాట్లాడ‌లేద‌ని.. డీఎంకే.. ఆర్జేడీ.. ఎన్సీపీ.. కాంగ్రెస్  పార్టీలు కూట‌మిలో ఉన్నాయ‌ని.. ఇప్ప‌టికే రాహుల్.. చంద్ర‌బాబు.. శ‌ర‌ద్ ప‌వార్.. ఫ‌రూక్.. కేజ్రీవాల్ తాను స‌మావేశ‌మ‌య్యామ‌ని.. మ‌రిన్ని పార్టీలు కల‌వ‌నున్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ విప‌క్ష కూట‌మిలో కేసీఆర్ లేర‌న్న దానికి భిన్నంగా మమ‌త నోటి నుంచి వ‌చ్చిన మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News