తాజా షాక్ తో మోడీతో సంధికి దీదీ రెఢీ!

Update: 2019-05-29 07:11 GMT
అధికారానికి ఎవ‌రైనా త‌గ్గాల్సిందే. లేకుంటే మొద‌టికే మోసం రావటం ఖాయం. మొండిత‌నానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ లా.. ఒక ప‌ట్టాన కొరుకుడుప‌డ‌ని అధినేత్రిగా పేరున్న ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి తాజాగా ఊహించ‌ని షాక్ త‌గిలింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌శ్చిబెంగాల్ లో ఉన్న 42 ఎంపీ స్థానాల్లో 18 స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ కేవ‌లం రెండు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది.

బీజేపీ జోరును అడ్డుకునేందుకు దీదీ చాలానే ప్ర‌య‌త్నాలు చేసినా.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన మార్పును ఆమె అడ్డుకోలేక‌పోయారు. తాజా ఎన్నిక‌ల్లో ఇంత పెద్ద మొత్తంలో ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేసిన తీరును గుర్తించిన మ‌మ‌త‌.. ఆ వెంట‌నే ముంచుకొచ్చే ముప్పును గుర్తించారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు.. 50 మంది కౌన్సిల‌ర్ల‌ను ఢిల్లీకి పిలిపించుకొని మ‌రీ.. బీజేపీలో  చేర్పించిన వైనంతో ఆమెకు జ‌రిగేదేమిటో అర్థ‌మైన ప‌రిస్థితి.

త‌న‌కున్న  ప‌రిమితుల్లో బీజేపీతో తాను పోరాడ‌టం క‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని దీదీ గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా వెన‌క్కి త‌గ్గిన ఆమె.. రేపు (గురువారం) ఢిల్లీలో ప్ర‌ధాని ప‌ద‌వికి మోడీ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని దీదీ డిసైడ్ అయ్యారు. మోడీ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి హాజ‌రుకావటం ద్వారా బీజేపీతో తాను పేచీ పెట్టుకోవ‌టానికి సిద్ధంగా లేన‌ని.. సంధికి సిద్ద‌మ‌న్న సంకేతాన్ని దీదీ ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు.

గ‌డిచిన కొంత‌కాలంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో బీజేపీ పాగా వేయాల‌ని భావించ‌టం.. దానికి త‌గ్గ‌ట్లే మోడీషాలు ప్లాన్ వేయ‌టం.. త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌ని వేళ‌.. బీజేపీ ఎంట్రీ అయ్యేందుకు అవ‌కాశం ఇచ్చేలా క‌మ్యునిస్టులు వేస్తున్న ఎత్తుల్ని చిత్తు చేయాలంటే.. తాను క‌మ‌ల‌నాథుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కాకున్నా.. వారిని కంట్రోల్ చేయ‌టానికి తాము మోడీతో సంధి త‌ప్ప‌నిస‌రి అయ్యింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. దీనికి మోడీషాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News